పానీపూరీ అంటే ఇష్టమా.. మార్కెట్లో దొరికే రుచితో ఇంట్లోనే చేసుకోండి.. తయారీ విధానం ఏమిటంటే..

పానీపూరీ అంటే ఇష్టమా.. మార్కెట్లో దొరికే రుచితో ఇంట్లోనే చేసుకోండి.. తయారీ విధానం ఏమిటంటే..


పిల్లలు పెద్దలు , స్టూడెంట్స్, ఉద్యోగస్తులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తినే స్ట్రీట్ ఫుడ్ పానీ పూరీ. ఉత్తరాది నుంచి దక్షిణాదిలో అడుగు పెట్టిన ఇది .. ఇప్పుడు విదేశాల్లో కూడా ఫేమస్ అయింది. గొల్గప్ప, పానీపూరి లేదా పుచ్కా పేరు ఏదైనాసరే వీటి రుచి అందరి హృదయాలను గెలుచుకుంటుంది. అందుకనే సాయంత్రం అయితే చాలు స్నాక్ అంటే వెంటనే పానీపూరీ షాప్ దగ్గరకు క్యూ కట్టేవారు చాలా మంది ఉన్నారు. అయితే వీటిని ఇంట్లోనే తయారు చేసుకుని ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా పులుపు, కారం కలిసిన రుచిని అస్వాదించండి. స్పైసీ గొల్గప్పాలను ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే…

తయారీకి కావాల్సిన పదార్ధాలు

  1. సుజీ రవ్వ – 1 కప్పు,
  2. మైదా లేదా గోధుమ పిండి – 2 టేబుల్ స్పూన్లు
  3. బేకింగ్ సోడా – 1/4 టీస్పూన్
  4. ఉప్పు – రుచికి తగినంత
  5. నూనె – వేయించడానికి.

పానీపూరీ ఫిల్లింగ్ కోసం…

  1. బంగాళాదుంపలు – 2 ఉడికించినవి
  2. పప్పులు లేదా బఠానీలు – 1/2 కప్పు (ఉడికించినవి)
  3. చిన్న ఉల్లిపాయ – 1 సన్నగా తరిగిన (ఐచ్ఛికం),
  4. చాట్ మసాలా – 1/2 టేబుల్ స్పూన్,
  5. ఉప్పు – రుచికి తగినట్లుగా,
  6. సన్నగా తరిగిన కొత్తిమీర – కొద్దిగా.

పానీ పూరీ నీటి కోసం…

  1. తరిగిన కొత్తిమీర – 1 కప్పు,
  2. పుదీనా ఆకులు – 1/2 కప్పు,
  3. పచ్చిమిర్చి – 2-3 చిన్నగా కట్ చేసిన ముక్కలు
  4. అల్లం ముక్క – 1 అంగుళం
  5. చింతపండు గుజ్జు – 2 టేబుల్ స్పూన్లు,
  6. వేయించిన జీలకర్ర పొడి – 1 టీస్పూన్,
  7. నల్ల ఉప్పు – 1/2 టీస్పూన్,
  8. తెల్ల ఉప్పు- కొంచెం
  9. నీరు – 5 కప్పులు.

తయారీ విధానం: ఒక గిన్నె తీసుకుని సుజీ రవ్వ, గోధుమ పిండి, బేకింగ్ సోడా, ఉప్పు వేసి బాగా కలపండి.

ఆ పిండి మిశ్రమంలో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ.. గట్టిగా చపాతీ పిండిలా కలపాలి. తర్వాత ఈ పిండి మీద తడి గుడ్డ వేసి 20-25 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.

ఇవి కూడా చదవండి

మళ్ళీ పిండిని పిసికి.. కావాల్సిన సైజ్ లో ఉండలు చేసి వాటిని అరచేతులతో నొక్కి పక్కకు పెట్టుకోండి.

ఇప్పుడు రోలింగ్ బోర్డు మీద గుండ్రని ఉండలు పెట్టి.. కొంచెం మందంగా ఉండేలా చిన్న చిన్న రోటీలుగా చేసుకుని .. వాటిని కట్టర్ లేదా మూతతో గుండ్రంగా కత్తిరించుకోవాలి.

ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి.. మీడియం మంట నూనె వేడి చేయండి. నూనెలో ఒక్కొక్కటిగా పూరీలు వేసి వేయించండి. ప్రతి పూరీని గరిటెతో తేలికగా నొక్కండి. ఇలా చేయడం వలన అది ఉబ్బుతుంది. అది ఉబ్బిన వెంటనే.. పూరీలను రెండో వైపు తిప్పి రెండు వైపులా బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి. అంతే గొల్గప్పాస్ సిద్ధం అయ్యాయి.

గొల్గప్పాలకు ఫిల్లింగ్ కోసం

ఒక గిన్నెలో ఉడికించిన బంగాళాదుంపలను తీసుకుని మెత్తగా చేసి.. తీసుకున్న అన్ని పదార్థాలను వేసి బాగా కలపండి. స్టఫింగ్ సిద్ధంగా ఉంది.

పానీ పూరీ నీటి కోసం

ముందు చింతపండు నీరు తయారు చేసుకోవాలి. ఇంతలో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లంను కొద్దిగా నీరు వేసి మెత్తని పేస్ట్ గా చేసుకుని ఈ పేస్ట్‌ను ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో వేసుకోవాలి. ఇందులో రెడీ చేసిన చింతపండు నీరు, వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, తెల్ల ఉప్పు వేసి బాగా కలపండి. తర్వాత కావాల్సిన మొత్తంలో నీరు పోసుకుంటే పానీపూరీకి నీరు రెడీ.

ఇప్పుడు ఒక్కొక్క గోల్ గప్ప తీసుకుని దానికి హోల్ పెట్టి.. ఫిల్లింగ్ చేసి పానీపూరీ నీటిలో ముంచి అందించండి. తిన్నవారు వావ్ అనాల్సిందే. ఇంకొకటి అంటూ తింటారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *