పాక్ మ్యాచ్ కోసం కోచ్ గంభీర్ మాస్టర్ ప్లాన్.. ప్లేయింగ్ 11లోకి నలుగురు మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్స్?

పాక్ మ్యాచ్ కోసం కోచ్ గంభీర్ మాస్టర్ ప్లాన్.. ప్లేయింగ్ 11లోకి నలుగురు మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్స్?


Gautam Gambhir: 2026 టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌తో జరిగే కీలక పోరుకు భారత జట్టు సిద్ధంగా ఉంది. ఈ బ్లాక్‌బస్టర్ మ్యాచ్ కోసం కోచ్ గౌతమ్ గంభీర్ ఓ మాస్టర్ ప్లాన్‌ రూపొందించాడు. ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఒకేసారి నలుగురు మ్యాచ్ విన్నింగ్ స్పిన్నర్లను రంగంలోకి దింపేందుకు సిద్ధమయ్యాడు. అంటే, ఫిబ్రవరి 15న కొలంబోలో జరిగే మ్యాచ్‌లో కోచ్ గౌతమ్ గంభీర్ తన స్పిన్ అస్త్రాలను పాకిస్థాన్‌ జట్టుపై ప్రయోగించేందుకు సిద్ధమయ్యాడు. ఈ నలుగురు మ్యాచ్ విన్నింగ్ భారత స్పిన్నర్లు ఎవరు, పాకిస్థాన్‌కు ఎవరు ముప్పుగా ఉంటారో ఓసారి చూద్దాం..

వాషింగ్టన్ కు అవకాశం..

భారత స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ పూర్తిగా ఫిట్ గా ఉన్నాడు. జట్టులో చేరాడు. నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో సుందర్‌కు ఆడే అవకాశం రాలేదు. కానీ, కోచ్ గౌతమ్ గంభీర్ ఈ యువ స్పిన్ ఆల్ రౌండర్‌ను పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో నేరుగా బరిలోకి దించవచ్చని భావిస్తున్నారు. సుందర్ తన బౌలింగ్ తోనే కాదు, బ్యాటింగ్ ఆర్డర్‌లో భారీ షాట్లు కూడా కొట్టగలడు. ఇది మ్యాచ్‌లో కీలకం అవుతుంది.

IND vs PAK: ఒకే ఒక్క ఓటమి.. టీమిండియాకు పీడకలలా మారిన రోజు ఎప్పుడో తెలుసా?

కుల్దీప్ యాదవ్ కూడా బరిలోకి..

2026 టీ20 ప్రపంచ కప్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు అవకాశం ఇవ్వలేదు. అయితే, కుల్దీప్ యాదవ్ ఆర్. ప్రేమదాస స్టేడియంలో పాకిస్థాన్‌పై ఆడే ఛాన్స్ ఉంది.

పాకిస్తాన్‌తో జరిగిన 3 టీ20 మ్యాచ్‌ల్లో కుల్దీప్ 8 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో 6.58 ఎకానమీ రేటును కూడా కొనసాగించాడు. అందుకే కోచ్ గౌతమ్ గంభీర్ కుల్దీప్‌ను ఎలాగైనా ఆడించాలని కోరుకుంటాడు. గతంలో పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టిన ఆర్. ప్రేమదాస పిచ్‌పై కుల్దీప్ యాదవ్ భారత్‌కు గేమ్ ఛేంజర్‌గా నిరూపించబడవచ్చు.

అక్షర్ పటేల్ నుంచి బలమైన ప్రదర్శన..

భారత జట్టు వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ పాత్ర పాకిస్తాన్ పై చాలా ముఖ్యమైనది కానుంది. ఎందుకంటే, అక్షర్ తన ఎడమ చేతి వేలు స్పిన్ తో పాకిస్తాన్ ను ఇబ్బంది పెట్టడమే కాకుండా, బ్యాట్ తో భారీ ఇన్నింగ్స్ ఆడే సామర్థ్యం కూడా కలిగి ఉన్నాడు.

IND vs PAK: పాకిస్థాన్‌తో తలపడే భారత జట్టు ఇదే.. ప్లేయింగ్ 11లో ఒకే ఒక్క మార్పు.. ఎవరికి హ్యాండిచ్చారంటే?

పాకిస్థాన్‌తో జరిగే బిగ్ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ తన నాలుగు ఓవర్లలో వీలైనన్ని ఎక్కువ వికెట్లు తీయాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. కోచ్ గౌతమ్ గంభీర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం, అక్షర్ ఈ ప్రయత్నంలో కీలక ఆటగాడు కావొచ్చు.

పాకిస్తాన్ జట్టుకు వరుణుడి గండం..

కుడిచేతి వాటం మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్పిన్ చాలా మంది బ్యాట్స్‌మెన్‌లకు అర్థం కాదు. అయితే, స్పిన్-ఫ్రెండ్లీ ఆర్. ప్రేమదాస పిచ్‌పై, వరుణ్ మరింత ప్రమాదకరమైన బౌలర్‌గా మారవచ్చు.

పాకిస్థాన్‌తో జరిగిన నాలుగు టీ20ఐలలో వరుణ్ కేవలం మూడు వికెట్లు మాత్రమే తీసుకున్నప్పటికీ, 2026 ప్రపంచ కప్‌లో తన గణాంకాలను మార్చుకోవాలని చూస్తున్నాడు. 2026లో భారతదేశం తరపున ఐదు మ్యాచ్‌ల్లో వరుణ్ ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ రేటు కేవలం 7.72 మాత్రమే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *