అమెరికా–ఇండియా మధ్య ట్రేడ్ డీల్ జరిగిన సమయంలో ట్రంప్ టీమ్ రిలీజ్ చేసిన ఓ మ్యాప్ పాకిస్తాన్ షాక్‌య్యేలా చేసింది. అమెరికా ట్రేడ్ ప్రతినిధుల ఆఫీస్ ‘ఎక్స్’లో జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని భారతదేశంలో భాగంగా చూపిస్తూ మ్యాప్‌ను విడుదల చేశారు. ఇందులో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌తో పాటు అక్సాయ్ చిన్ ప్రాంతం కూడా ఇండియాలో భాగంగా ఉంది. ఇండియా ఎప్పటి నుంచో కాశ్మీర్ తమ అంతర్భాగమని చెబుతుంది. పాకిస్తాన్ దాన్ని వ్యతిరేకిస్తూ వస్తుంది. ఈ విషయంలో అమెరికా తటస్థంగా ఉండేది. అయితే అమెరికా సంస్థలు గతంలో విడుదల చేసిన మ్యాప్‌లలో వివాదాస్పద ప్రాంతాలను వేరుగా చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు రిలీజ్ చేసిన మ్యాప్ మాత్రం భారత్‌కు అనుగుణంగా ఉండడంతో ప్రాధాన్యత ఏర్పడింది. పీఓకే విషయంలో అమెరికా ఇంతవరకు స్పష్టంగా భారత అభిప్రాయానికి అనుగుణంగా ఎక్కడా మాట్లాడిన సందర్భాలు లేవు. అయితే ఇప్పుడు రిలీజైన మ్యాప్.. పాకిస్తాన్‌కు దౌత్యపరమైన ఎదురుదెబ్బగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో అమెరికాతో పాకిస్తాన్ సంబంధాలను మెరుగుపరుచుకుంటూ వస్తుంది. ఇప్పుడు అవన్నీ బెడిసి కొట్టినట్లేనని అంటున్నారు. అక్సాయ్ చిన్ ప్రాంతంపై తమకు హక్కు ఉందని చెప్పుకుంటున్న చైనాకూ ఈ విషయం మింగుడు పడదని అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పూనకంతో ఊగిపోతూ.. 6 నిమిషాల్లో 4 లీటర్ల నీళ్లు తాగిన నటి
బర్డ్ ఫ్లూ కలకలం.. ఆ జిల్లాలో హై అలర్ట్
అంగన్‌వాడి చిన్నారులకు పాఠాలు చెప్పిన ఐఏఎస్
Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కు షాక్.. కల్కి-2 ఇప్పట్లో లేనట్టేనా ??
సంక్రాంతి బరిలో నాగ్, నాగచైతన్య మల్టీ స్టారర్