పాక్‌కు సింధ్ నీళ్లు బంద్‌ !! వేసవికి ముందు షాకిచ్చిన భార‌త్

పాక్‌కు సింధ్ నీళ్లు బంద్‌ !! వేసవికి ముందు షాకిచ్చిన భార‌త్


పాకిస్థాన్‌కు వెళ్తున్న రావి నది మిగులు జలాలను పూర్తిగా నిలిపి వేయనుంది భారత్. . పంజాబ్- కశ్మీర్ సరిహద్దులో నిర్మిస్తున్న షాపుర్‌కండి బ్యారేజీ నిర్మాణం మార్చి నాటికి పూర్తవుతుందని కశ్మీర్ జలవనరుల మంత్రి రాణా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టి రావి నది నుంచి పాకిస్థాన్‌కు వెళ్లే నీటిని పూర్తిగా ఆపేస్తామని మంత్రి అన్నారు. బ్యారేజ్‌లో నిల్వ చేసిన నీటిని కశ్మీర్‌లోని కరవు పీడిత ప్రాంతాల్లోని 32 వేల హెక్టార్ల వ్యవసాయ భూములకు నీరు అందించనున్నారు. దీంతో పాటు పంజాబ్‌లో 5,000 హెక్టార్లకు నీరు అందనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 206 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా జరగనుంది. ఇప్పటివరకు భారత్ వినియోగించుకోని ఈ నీరు వృథాగా పాకిస్థాన్‌కు వెళ్తోందని, ఇకపై దానిని మన రైతుల ప్రయోజనాల కోసం వాడుకుంటామని మంత్రి రాణా తెలిపారు. 1960 నాటి సింధు జలాల ఒప్పందం ప్రకారం రావి నదిపై భారత్‌కు పూర్తి హక్కులు ఉన్నాయి. వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు 1982లోనే నాటి ప్రధాని ఇందిరా గాంధీ శంకుస్థాపన చేసినా.. పంజాబ్, జమ్మూ కశ్మీర్ మధ్య వివాదాల కారణంగా నిలిచిపోయింది. 2018లో కేంద్రం జోక్యంతో పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ పట్ల కఠినంగా వ్యవహరించాలనే వ్యూహంలో భాగంగా భారత్ ఈ ప్రాజెక్టును నిర్మించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రియురాలిని హత్య చేసి.. ఆమె ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు

పెళ్లికి అతిథిలా వచ్చాడు.. సరదాగా ఎత్తుకుపోయారు..

సాయం కావాలని ఆస్పత్రి మెట్లెక్కిన పక్షి !! చివరికి

తాళి కట్టే సమయానికి రద్దయిన వివాహం.. అసలు వాడు మగాడే కాదా?

Cow: తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్‌ అధికారులకు పట్టించిన ఆవు..

ట్యాబ్‌లెట్‌ వేసుకుంటూనే కుప్పకూలిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *