వీటిలో ఉండే క్షార గుణాలు మన శరీరంలోని ఆమ్లత్వాన్ని తగ్గించి పీహెచ్ స్థాయిని సమతుల్యం చేయడం వల్ల మన సమస్యలు దూరమవుతాయట. అంతే కాకుండా ఈ పండులో ఉండే సిట్రులిన్ అనే పదార్థం రక్తనాళాలు సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుందట. తద్వారా మన శరీరంలో రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల.. దీన్ని పరిగడుపున తీసుకుంటే మన శరీరం దానిలోని యాంటీ ఆక్సిడెంట్లను గ్రహించి చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడానికి దోహదపడుతుంది. ఇందులో ఉండే నీరు, ఖనిజ లవణాలు మన మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంతో పాటు, శరీరాన్ని సహజ సిద్ధంగా శుభ్రపరచడంలో తోడ్పడుతాయని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయలో ఉండే సహజ ఎంజైమ్‌లు మన జీర్ణవ్యవస్థను ఉత్తేజితం చేయాలంటే.. పుచ్చకాయ తిన్న తర్వాత,అరగంట వరకు ఇతర ఏ ఆహారాన్ని తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో, పుచ్చకాయలోని ఎంజైమ్‌లు జీర్ణవ్యవస్థను తదుపరి ఆహారం కోసం సిద్ధం చేస్తాయి. ఈ చిన్న విరామం పాటించడం వల్ల రోజంతా జీర్ణక్రియ సజావుగా సాగుతుందని నిపుణులు వివరిస్తున్నారు. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడం మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రన్నింగ్ ట్రైన్‌లో రక్తం కారేలా కొట్టుకున్న మహిళలు !! చివరకు
నా ఒళ్లు.. నా ఇష్టం.. మీకేంటి నొప్పి !! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న నటి కామెంట్స్
విమానంలో రెచ్చిపోయి రచ్చ చేసిన మహిళ.. ఏంటి మావా ఇలా ఉన్నారు
లక్ అంటే ఆ జాలరిదే.. ఒక్క దెబ్బకు లక్షాధికారిని చేసిందిగా
అమ్మబాబోయ్.. బాత్‌రూంలో భారీ కోబ్రా