వీక్‌డేస్‌లో కూడా తన భర్త 9.30 తర్వాత ఇంటికి వచ్చేవారని గావో భార్య లీ తెలిపింది. అతడి ఆఫీసులో వర్క్‌లోడ్ చాలా ఎక్కువగా ఉండేదని.. అందుకే గావో తన టీమ్ సభ్యులతో కలిసి పనిచేసేవాడని అంది. అయితే తనకే గనుక సమయాన్ని వెనక్కి తిప్పే శక్తి ఉంటే.. ఉద్యోగం మానేయాలని గావోపై ఒత్తిడి తీసుకువచ్చేదాన్నని కన్నీరుమున్నీరుగా విలపించింది. గావో చిన్నప్పటినుంచి కష్టాల మధ్య పెరిగాడని డబ్బుల కోసం చెత్త సేకరించేవాడని చెబుతున్నారు. గావో చేత చివరి శ్వాస వరకు పని చేయించుకుందని.. ఓవర్‌టైమ్ చేయించుకునే కంపెనీలు నాశనం అయిపోవాలని ఓ నెటిజన్ భావోద్వేగంతో శాపనార్థాలు పెట్టడం.. ఓవర్ టైమ్ కల్చర్ తీవ్రతకు అద్దం పడుతోంది. వాస్తవానికి చైనాలో రోజుకి 8 గంటలు.. వారానికి 44 గంటలు మాత్రమే పని చేయాలని కార్మిక చట్టాలు చెబుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :