‘పద్మ’ గౌరవం సంతోషంలో ముంచేసింది.. రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తా

‘పద్మ’ గౌరవం సంతోషంలో ముంచేసింది.. రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తా


‘పద్మ’ గౌరవం సంతోషంలో ముంచేసింది.. రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తా

ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. ఈ అవార్డు లభించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ, ఇది తమకు మరింత బాధ్యతను, వినయాన్ని పెంచిందని తెలిపారు. తన వృత్తిని ప్రారంభించినప్పటి నుండి డబ్బు లేదా కీర్తి కోసం కాకుండా, రోగులకు చిత్తశుద్ధితో సేవ చేయాలని తన తండ్రి ఇచ్చిన సలహానే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేకించి, బాధిత క్యాన్సర్ రోగులను, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన పిల్లలను సంతోషంగా ఇంటికి పంపడమే తన గోలని అన్నారు. 2003లో క్యూర్ ఫౌండేషన్ స్థాపించి వందలాది మంది చిన్నారులకు ఉచితంగా లేదా రాయితీతో క్యాన్సర్ చికిత్స అందించినట్లు డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి వివరించారు. ఈ అవార్డు తనకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని, ప్రజలకు, రోగులకు మరింత సేవ చేసేందుకు నిబద్ధతతో ఉంటానని ఆయన వెల్లడించారు.

మరిన్ని వీడియోల కోసం :

టోల్‌గేట్‌ వద్ద గుట్టు గుట్టలుగా నోట్ల కట్టలు!

స్థిరంగా బంగారం ధరలు.. బడ్జెట్‌ తర్వాత తగ్గే ఛాన్స్‌?

ఏడేళ్లుగా రైల్వేపై విద్యార్థిని పోరాటం..చివరకు..

చిరు వ్యాపారులకు అమెజాన్‌ బిగ్‌ ఆఫర్‌



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *