అర కిలో మటన్, పచ్చి బొప్పాయి ముక్కలు, ఉల్లిపాయలు చిన్నవి, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర కప్పు పెరుగు,
2 టేబుల్ స్పూన్స్ కారం, అర టీ స్పూన్స్ పసుపు, ఉప్పు రుచికి తగినంత, అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా,
3 టేబుల్ స్పూన్స్ నూనె తీసుకోవాలి.
ముందుగా మటన్ ముక్కలను తీసుకుని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చి బొప్పాయిని తీసుకుని తురుమి దానిలో
పసుపు, కారం, ఉప్పు, ఒక కప్పు పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అన్ని కలిపి 30 నిముషాల పాటు పక్కాన పెట్టుకోవాలి.
ఇక ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి, దానిలో నూనె వేసి అది వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి రంగు మారే వరకు బాగా వేయించాలి.
ఇక ఇప్పుడు బొప్పాయి పేస్ట్ ను పట్టించిన మటన్ ను దానిలో వేసి 20 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి. మధ్యలో ఒకసారి గరిటేతో తిప్పుతూ ఉండండి.
ఇక ఇప్పుడు మూత పెట్టి సన్నని మంటపై అలాగే ఉంచి మటన్ ఉడికే వరకు అలాగే ఉంచండి. గ్రేవీ కావాలనుకునే వారు కొంచం నీళ్ళు పోసి 10 నిముషాలు అలాగే ఉంచి కొత్తిమీర వేసి కిందకు దించేయండి. అంతే, వేడి వేడి పచ్చి బొప్పాయి మటన్ కూర రెడీ.




