మెగాస్టార్ చిరంజీవి “మనశంకర వరప్రసాద్” చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై తెలుగు ప్రేక్షకులను, సినీ ప్రముఖులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాపై కోలీవుడ్ సీనియర్ నటి ఖుష్బూ తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. “నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్” అంటూ ఆమె ఒకే వాక్యంలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సినిమాలతో పాటు రాజకీయాలు, సామాజిక సేవా కార్యక్రమాలతో బిజీగా ఉండే ఖుష్బూ, చిరంజీవి చిత్రాన్ని వీక్షించిన అనంతరం ట్వీట్ చేశారు. “వాట్ ఏ ఎంటర్టైనర్” అంటూ సినిమా తనకు నచ్చిందని పేర్కొన్నారు. “చిరంజీవి తాను ప్రేమించే అభిమానుల కోసం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం చూసి గర్వపడుతున్నాను” అని ఆమె రాశారు.
మరిన్ని వీడియోల కోసం :