సిల్వర్ స్క్రీన్‌పై తన స్టైల్‌తో అందరినీ ఆకట్టుకునే రజినీకాంత్, నిజ జీవితంలో తన అభిమానుల నిజాయితీ, నిబద్ధతలకు ఫిదా అవుతుంటారు. పేదల కడుపు నింపుతున్న పరోటా వ్యాపారిని గతంలో సత్కరించిన తలైవా, ఇప్పుడు పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మ నిజాయితీకి గౌరవం ఇచ్చారు. చెన్నై నగరంలో 45 తులాల బంగారం దొరికినా, పద్మ దానిని వెంటనే పోలీసులకు అప్పగించారు. ఈ నిజాయితీకి తమిళ ప్రజల ప్రశంసలు దక్కాయి. ఈ విషయం తెలుసుకున్న రజినీకాంత్, పద్మను తన ఇంటికి ఆహ్వానించి, ఆప్యాయంగా మాట్లాడి ఆమెకు బంగారు గొలుసును బహుమతిగా అందించారు. రజినీ ఆమెతో కలిసి భోజనం చేసి, స్వయంగా వడ్డించారు.
మరిన్ని వీడియోల కోసం :