సినీ ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి వినిపిస్తున్న టాపిక్ క్యాస్టింగ్ కౌచ్. అయితే దీని పై చాలా మంది తమ అభిప్రాయాలను, చేదు అనుభవాలను కూడా పంచుకున్నారు. అయినప్పటికీ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో ఉందా లేదా అన్నది అనుమానంగానే ఉంది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ నిర్మాత ఇలా అని.. ఈ దర్శకుడు అలా అని చాలా మంది చెప్పుకొచ్చారు. తాజాగా ఓ యువనటి కూడా క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. గతంలోనూ ఆమె చాలా సార్లు క్యాస్టింగ్ కౌచ్ పై ఆమె స్పందించింది. తన కన్న తండ్రే తాను చాలా హింసించాడని చెప్పి షాక్ ఇచ్చింది. ఇంతకూ ఆమె ఎవరో కాదు.
ఇది కూడా చదవండి :తండ్రి స్కూల్ ముందు సమోసాలు అమ్మేవాడు.. కూతురు ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ సింగర్.
ఆ నటి ఎవరో కాదు గాయత్రీ గుప్తా. ఈ అమ్మడు కొన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన గాయత్రి గుప్తా. సాయి పల్లవి నటించిన ఫిదా సినిమాలో ఫ్రెండ్ పాత్రలో నటించి మెప్పించింది. గతంలో చాలా కాంట్రవర్సీల్లో కనిపించింది. తాజాగా ఆమె క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ విషయం చెప్పుకొచ్చింది. అలాగే తన తండ్రి పై కూడా కామెంట్స్ చేసింది.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి : అలాంటి సీన్ చేసి ఇంటికెళ్లి ఏడ్చా.. ఇప్పటికీ బాధగానే ఉంది.. ఇన్నాళ్లకు అసలు విషయం బయట పెట్టిన సదా
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. కొంతమంది హీరోయిన్స్ ఆఫర్స్ కోసం కమిట్ మెంట్ ఇస్తున్నారు. హీరోయిన్స్ ఆఫర్స్ కోసం చేస్తుంటే అది అవతలి వారికి ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పుకొచ్చింది గాయత్రీ. అమ్మాయిలందరూ సుద్దపూసలు కాదని.. అబ్బాయిలందరూ చెడ్డవాళ్లు కాదు అని తెలిపింది గాయత్రీ. అమ్మాయిలు తన తండ్రిలాంటి అబ్బాయి కావాలి అని కోరుకుంటారు. కానీ నా విషయంలో ఫాదర్ ఈక్వేషనే చెడిపోయిందని చెప్పుకొచ్చింది. తన తండ్రి తనను చిత్ర హింసలు పెట్టాడని.. పిచ్చి పిచ్చిగా కొట్టేవాడని తెలిపింది. కరెంట్ వైర్‌తో కొట్టి ఆ గాయాల పై కారం పూసేవాడు. ఇక ఇండస్ట్రీకి వచ్చి వచ్చిన తర్వాత తన పై చాలా రేప్ ఎటాక్స్ జరిగాయని తెలిపింది. చాలా మంది వీటి గురించి బయట మాట్లాడారు.. కానీ తాను బయటకు వచ్చి చెప్పడం వల్లే తన కెరీర్ ప్రాబ్లమ్ లో పడిందని చెప్పుకొచ్చింది. ఎప్పుడూ కమిట్మెంట్ తో వెళ్ళలేదు.. ఓ సినిమా పార్టీలో నేను మందు తాగాల్సి వచ్చింది. తాగిన తర్వాత నన్ను కారులో డ్రాప్ చేస్తా అని డైరెక్టర్ ఓ నిర్మాత ఇంటికి తీసుకెళ్లాడు. ఆ నిర్మాత నా డ్రస్ లాగడం, నాతో పిచ్చి ప్రవర్తించడం చేశాడు.. ఆ రోజు నా డ్రస్సే నన్ను కాపాడింది. ఒక గంట సేపు నన్ను ఇబ్బందిపెట్టాడు. ఇక పని అయ్యేలా లేదని వదిలేశాడు. ఇంటికి వెళ్ళాక ఓ ఈవెంట్ మేనేజర్ నన్ను గలీజ్ గా హగ్ చేసుకున్నాడు అంటూ గాయత్రి గుప్తా ఓపెన్ గా చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి : ఏం సినిమా రా అయ్యా..! థియేటర్స్‌లో డిజాస్టర్..11ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న సినిమా..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి