అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డే.. వరుసగా సినిమాలు చేస్తున్న అంతగా అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తదితర తెలుగు స్టార్ నటులందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది.
గతకొన్నేళ్ళుగా పూజా హెగ్డే ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు. వరుసగా హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ఆ నటి ఇప్పుడు చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు! మొన్నామధ్య సూర్య హీరోగా నటించిన రెట్రో సినిమాలో హీరోయిన్ గా చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో పేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.
పూజా హెగ్డే హీరోయిన్ గా చేసిన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, సిర్కస్, కిసీ కా భాయ్ కిసీ కి జాన్, దేవా రీసెంట్ గా వచ్చిన రెట్రో ఇలా వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను నిరాశపరిచాయి. వరుసగా ఏడు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఈ అమ్మడికి వరుసగా ఛాన్స్ లు వస్తున్నాయి. ప్రస్తుతం దళపతి విజయ్ హీరోగా నటించిన జననాయగన్ సినిమాలో హీరోయిన్ గా చేసింది. కానీ ఈ సినిమా విడుదలకు నోచుకోవడం లేదు.
గతంలో పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ మధ్య కాలంలో నేను నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరుస్తున్నాయి. కొన్నాళ్లుగా నా లైఫ్ లో విజయం అనే పదానికి అర్ధం మారిపోయింది. కానీ నాకు ఈ టైం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకొచ్చింది.
అలాగే భవిష్యత్తులో నేను చేసే సినిమాలు నేను ఎలాంటి నటిని అనేది ప్రేక్షకులకు చుపిస్తాయని అనుకుంటున్నా.. సినీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన నాలాంటి వాళ్లు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు.. వారు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నా కానీ నేను సాధించాల్సింది చాలా ఉంది. అందరి జీవితంలో హెచ్చుతగ్గులు కచ్చితంగా ఉంటాయి. మేము నటులం ఫ్లాప్ లను కూడా స్వీకరించాలి అని తెలిపింది.




