మన వంటింట్లో సహజసిద్ధమైన ఔషధ గుణాలున్న పదార్థాలు ఎన్నో ఉన్నాయి. మసాలా దినుసుల్లో ఎన్నో పోషకాలతోపాటు.. ఔషధ గుణాలు దాగున్నాయి. వీటితో ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకోవచ్చు.. అలాంటి పవర్‌ఫుల్ మసాలా దినుసుల్లో మిరియాలు ఒకటి.. ఇది ఆహారం రుచిని పెంచడంతోపాటు.. ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే, మిరియాలు.. ఔషధం కంటే తక్కువ కాదని, దీనిలో ఉండే క్యాప్సైసిన్ ఆరోగ్యానికి బాగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అందుకే.. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే.. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నల్ల మిరియాలు పొడి కొంచెం కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు. మిరియాల నీరు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..
మిరియాలలో అనేక పోషకాలు దాగున్నాయి. విటమిన్ సి, విటమిన్ కె, మాంగనీస్, కాపర్, ఐరన్, పొటాషియంతోపాటు.. మిరియాలలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి.
నల్ల మిరియాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు..
మిరియాలను గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే శారీరక దృఢత్వం పెరుగుతుంది. అలాగే శరీరంలో నీటి కొరత తగ్గుతుంది. ముఖ్యంగా పని చేసే పురుషులకు ఇది చాలా మంచి పానీయం అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
మిరియాలు కడుపు సమస్యలను దూరం చేస్తాయి.. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కడుపులో గ్యాస్ లేదా అసిడిటీ ఉంటే నిమ్మరసంలో చిటికెడు బ్లాక్ సాల్ట్, మిరియాల పొడి కలుపుకుని తాగితే ఉపశమనం కలుగుతుంది.
నల్ల మిరియాలలో పైపెరిన్ ఉంటుంది. ఇది యాంటీ డిప్రెసెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీని కారణంగా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది ఉద్రిక్తత, నిరాశను తొలగించడంలో సహాయపడుతుంది.
నల్ల మిరియాలు చిగుళ్ల నొప్పి నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తాయి.
నల్ల మిరియాలు విటమిన్ సి, విటమిన్ ఎ, ఫ్లేవనాయిడ్స్, కెరోటిన్లు, ఇతర యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇది మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి..
జలుబులో మిరియాలు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తాయి.. మిరియాలను వేడి పాలలో కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది.
అయితే.. మిరియాలు వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. కావున, వీటిని మితంగా తీసుకోవాలి.. ఏమైనా సమస్యలున్నా.. సందేహాలున్నా.. వైద్య నిపుణులను సంప్రదించండి..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..