ఓటీటీల పుణ్యమా అని ఇతర బాషల సినిమాలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కేవలం తెలుగు సినిమాలే కాదు.. తమిళ్, హిందీ, మలయాళ భాషల్లోని సినిమాలు తెరకెక్కిన సినిమాలు తెలుగులో డబ్ అయ్యి అలరిస్తున్నాయి. ముఖ్యంగా మలయాళ సినిమాలు రీసెంట్ డేస్ లో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కొన్ని మలయాళ సినిమాలు థియేటర్స్ లో అలరిస్తుంటే.. చాలా సినిమాలు ఓటీటీలో మెప్పిస్తున్నాయి. ఇక ఓటీటీలో మలయాళ సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇక ఇప్పుడు ఓటీటీలో మలయాళ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఓటీటీలో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఇద్దరు చెల్లెళ్లు, ఒక అన్న, అమ్మ మధ్య ఈ సినిమా సాగుతుంది.
ఇది కూడా చదవండి :ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి
ఇక ఈ సినిమాలో అన్న మణు, చెల్లి మీరాతో పాటు మరో చెల్లి కూడా ఉంటుంది. కాగా హీరో మణు తాను ప్రేమించిన అమ్మయి తండ్రిని ఇంప్రెస్ చేయడానికి స్థానికి సోసైటీలో ఉద్యోగానికి చేరతాడు. సోసైటీ ప్రెసిడెంట్ కూతరు హీరో లవర్. అయితే ఆ అమ్మాయి ఇంట్లో ఎవరు లేని సమయంలో మణను ఇంటికి రమ్మని పిలుస్తుంది. రాత్రి సమయంలో సడన్ గా ఆ అమ్మాయి పేరెంట్స్ వస్తారు. దాంతో ఇద్దరు దొరికిపోతారు. ఆతర్వాత పెద్ద రచ్చ జరుగుతుంది. చివరకు ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయిస్తారు. కానీ మణు తన చెల్లికి పెళ్లి చేసిన తర్వాత తాను పెళ్లి చేసుకుంటాను అందుకు 6 నెలలు టైం కావాలని అడుగుతాడు.
ఇది కూడా చదవండి : ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి
అయితే హీరో తన చెల్లెలికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటాడు. ఇంతలో ఆమె బండారం బయటపడుతుంది. ఆమె లవ్ స్టోరీస్ ఒకొక్కటిగా బయటకు వస్తుంటాయి. ఆమె ఒకరితో కాదు ఇద్దరితో కాదు ఏకంగా నలుగురిని లవ్ చేస్తుంది. అయినా కూడా అన్న చూసిన పెళ్ళికి రెడీ అవుతుంది. దాంతో హీరో బిత్తరపోతాడు. చివరకు ఏం జరిగింది, హీరో చెల్లి ఎవరిని పెళ్లి చేసుకుంది. అసలు ఏం జరిగింది అనేది సినిమాలో చూడాలి. ఈ సినిమా ఊహించని ట్విస్ట్ లు, కామెడీ సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా పేరు మధుర మనోహర మోహం. ఈ సినిమాను ఇది అమెజాన్ ప్రైమ్‌లో ఉండేది. కానీ ఇప్పుడు HR OTTలో అందుబాటులో ఉంది.
ఇవి కూడా చదవండి