నది దాటుతున్న జీబ్రాకు ఊహించని ఘటన ఎదురైంది. అప్పటికే వేటకోసం వేచి చూస్తున్న మొసళ్లు జీబ్రా రాగానే చుట్టుముట్టాయి. మొసళ్లన్నీ చుట్టూ చేరడంతో జీబ్రా షాక్ అయింది. వాటిలో ఓ మొసలి జీబ్రాను కొరికే ప్రయత్నం చేసింది. దాని నుంచి తప్పించుకునేందుకు జీబ్రా ధైర్యంగా పోరాడింది. మొసలి నోటికి తన నోటితో పట్టుకొని దాని నుంచి తప్పించుకునేందుకు జీబ్రా ధైర్యంగా పోరాడింది. మొసలి నోటిని తన నోటితో పట్టుకొని కురుకేసింది. మరికొన్ని మొసళ్లు దాడి చేసినా వాటిని కూడా ధైర్యంగా ఎదుర్కొని ఒడ్డుపైకి చేరుకుంది. ఈ వైరల్ వీడియో ఎక్కడ ఏ ప్రాంతంలో షూట్ చేశారో వివరాలు తెలియరాలేదు. కానీ ఇప్పటివరకు 1.5 కోట్ల మంది చూశారు. 1.4 లక్షల కంటే ఎక్కువ మంది వీడియోను లైక్ చేశారు. వీడియోపై స్పందించిన నెటిజన్లు జీబ్రా ధైర్యం ముందు మొసలి బలం నిలవలేకపోయిందని కామెంట్ చేస్తున్నారు. జీవితంలో చివరి నిమిషం వరకు ధైర్యంగా పోరాడాలని ఈ జీబ్రా పాఠం నేర్పుతుందని మరొకరు తెలిపారు. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆశ కోల్పోకుండా ఫైట్ చేయాలని ఇంకొకరు కామెంట్ చేశారు