ద్రాక్ష వర్సెస్‌ ఎండు ద్రాక్ష..! ఆరోగ్యానికి ఏవి మంచివో తెలుసా?

ద్రాక్ష వర్సెస్‌ ఎండు ద్రాక్ష..! ఆరోగ్యానికి ఏవి మంచివో తెలుసా?


ఎండు ద్రాక్షలో కేవలం 15 శాతం మాత్రమే నీరు ఉంటుంది. ద్రాక్షతో పోల్చితే ఇందులో విటమిన్ సి, ఇ, కె, బి1, బి2 తక్కువగా ఉంటాయి. ద్రాక్షలో దాదాపు 80 శాతం నీరు ఉంటుంది. ద్రాక్షలో విటమిన్ సి, ఇ, కె, బి1, బి2లు లభిస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి. ద్రాక్షలో రెస్వారెట్రాల్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటుంది. ద్రాక్షతో పోల్చితే ఎండు ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగాఉంటాయి. ఎండు ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు ద్రాక్షతో పోల్చితే 3 రెట్లు అధికం.

ద్రాక్షతో పోల్చితే ఎండు ద్రాక్షలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఒక కప్పు ద్రాక్షలో 30 కేలరీలు ఉండగా, కప్పు ఎండుద్రాక్షలో 250 కేలరీలు ఉంటాయి. ద్రాక్షలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర సమ్మేళనాలు రక్తపోటును కంట్రోల్‌ చేయడంలో సాయపడతాయి. ద్రాక్ష తింటే బీపీ తగ్గుతుంది. ద్రాక్షలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ద్రాక్ష తినడం వల్ల ఆకలి కంట్రోల్‌లో ఉంటుంది.

మీరు ఎక్కువ పోషకాల కోసం చూస్తున్నట్లయితే ఎండు ద్రాక్షలు తినండి. ఎండు ద్రాక్షలో పొటాషియం, ఐరన్‌, ఫైబర్‌ లభిస్తాయి. ద్రాక్షలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని అందంగా, ఆరోగ్యవంతంగాఉంచుతాయి. ద్రాక్ష తింటే చర్మం అందంగా మారుతుంది. మీరు జీర్ణ సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఎండు ద్రాక్ష తినండి. ఎండు ద్రాక్ష తింటే గట్‌ బ్యాక్టీరియాసమతుల్యంగా ఉంటుంది. దీంతో పేగులు ఆరోగ్యంగా మారుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *