నగరంలోని హిమాయత్‌నగర్ ఉర్దూ హాల్ ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తులో అరుణ్‌కుమార్ జైన్, పూజ అనే దంపతులు ఉంటున్నారు. వీరికి 2002లో వివాహం కాగా, ఓ అమ్మాయి, అబ్బాయి ఉన్నారు.అయితే, ఐదేళ్లుగా పూజ మానసిక సమస్యలతో బాధపడుతూ.. చికిత్స తీసుకుంటోంది. ఈ క్రమంలో ఇటీవల ఆమెకు దైవ చింతన పెరిగింది. దీంతో రోజంతా ఆమె ఆధ్యాత్మిక చింతనలో గడపసాగింది. శనివారం ఉదయం భర్త అరుణ్‌కుమార్ జైన్ ఆఫీస్‌కి వెళ్లిపోయారు. ఇంట్లో కొడుకు, కూతురుతో పాటు పని మనిషి ఉన్నారు. మధ్యాహ్నం వరకు పూజ గదిలో ఒంటరిగానే కూర్చున్న పూజా.. ఏం జరిగిందో తెలియదుగానీ ఒక్కసారిగా ఐదో అంతస్తుపై నుంచి కిందకు దూకేసింది. దీంతో తీవ్రగాయాల పాలైన పూజాను ఇరుగుపొరుగు వారు హుటాహుటిన హైదర్‌గూడలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆత్మహత్యకు ముందు పూజా కూర్చొన్న గదిలో ఓ కాగితం కనిపించింది. అందులో ధ్యానంలో గడుపుతూ ఆత్మార్పణ చేసుకుంటే దేవుడికి వద్దకు చేరుకుంటామని, స్వర్గం ప్రాప్తిస్తుందనే జైన గురువుల సూక్తి అందులో రాసి ఉన్నట్లు ఎస్సై నాగరాజు మీడియాకు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోజుకు రూ. 411 కడితే.. చేతికి రూ.43 లక్షలు.. ఈ అదిరిపోయే స్కీమ్ ఏదంటే..
మయసభ రివ్యూ.. పొలిటికల్ డ్రామా ఎలా ఉందంటే?