మన కెప్టెన్లు సినిమాలు చేసినా.. నార్త్ హీరోలతో సినిమాలు చేస్తేనే థియేటర్లు దొరుకుతాయా? మన హీరోలు సినిమాలు చేసినా, నార్త్ కెప్టెన్లతోనూ, నార్త్ ప్రొడక్షన్ హౌసులతోనూ మూవీస్ చేస్తేనే అక్కడ థియేటర్లు అందుబాటులో ఉంటాయా? పూర్తిగా మనకు మనం అక్కడికి వెళ్లి పాగా వేస్తామంటే కుదరదా? పుష్ప రెండు భాగాలకు మినహా.. మిగిలిన సినిమాల విషయంలో అక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉండటం లేదా? ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదో ఇంట్రస్టింగ్ డిస్కషన్ షురూ అయింది.
హృతిక్, తారక్ హీరోలుగా నటిస్తున్న సినిమా వార్2. నార్త్ లోనే కాదు, మన దగ్గర కూడా మాంచి హైప్ క్రియేట్ తెచ్చుకుంది. ఆగస్టు 14న రిలీజ్‌కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నార్త్ టు సౌత్ అందరూ వెయిట్ చేస్తున్న సినిమా ఇది.
వార్2 కి పోటీగా రంగంలోకి దిగుతోంది కూలీ మూవీ. సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి నార్త్ నుంచి ఆమీర్ సపోర్ట్ కూడా ఉంది. అయినా అక్కడ థియేటర్లు దొరకని పరిస్థితి ఉందట. ఆల్రెడీ ఐమ్యాక్స్ థియేటర్లన్నిటినీ వార్2 కబ్జా పెట్టేసిందట. సో, కూలీకి థియేటర్లు దొరికే పరిస్థితి లేదన్నది తాజాగా డిస్కషన్స్ లో ఉన్న పాయింట్.
క్రేజీ రిలీజ్ డేట్‌కి బిగ్ హీరోల సినిమాలు వస్తున్న ప్రతిసారీ థియేటర్ల ఇష్యూ ఉండేదే. కానీ, ప్రొడ్యూసర్స్ సౌత్ వాళ్లు అయితే, నార్త్ లో థియేటర్లు దక్కించుకునే సిట్చువేషన్ ఉండటం లేదనే మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
ఇలాంటి సందర్భాల్లో కొన్ని సినిమాలకు కంటెంట్ ఉన్నా కరెన్సీకి దూరం కావాల్సి వస్తుందంటున్నారు ట్రేడ్ పండిట్స్. రిలీజ్ డేట్ దగ్గర పడేకొద్దీ వార్2 వర్సెస్ కూలీ థియటేర్ల ఇష్యూ సాల్వ్ అవుతుందా? లేకుంటే కూలీకి కష్టాలు తప్పవా? లెట్స్ వెయిట్ అండ్ సీ..