అయితే, కొన్నిచోట్ల విద్యావంతులైన బాలికలు ఈ బాల్య వివాహాలను ధైర్యంగా తమకొద్దని పెద్దలకు చెబుతున్నారు. తాజాగా, ఓ 13 ఏళ్ల బాలిక.. హెడ్మాస్టర్ సాయంతో తనకు జరిగిన బలవంతపు వివాహాన్ని రద్దు చేయించగలిగింది. రంగారెడ్డి జిల్లా నందిగామలో బాల్య వివాహం కలకలం రేపింది. నందిగామకు చెందిన ఓ వితంతువు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.ఈమెకు ఒక కుమారుడు, 8వ తరగతి చదువుతున్న కుమార్తె ఉన్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, ఇతర కుటుంబ సభ్యుల అండ లేకపోవటంతో.. తన కూతురిని ఓ అయ్య చేతిలో పెట్టాలని ఆ తల్లి భావించింది. ఈ క్రమంలోనే ఆమె ఓ మధ్యవర్తిని ఆశ్రయించగా.. రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం, కందవాడకు చెందిన 40 ఏళ్ల వ్యక్తికి బాగా ఆస్తి ఉందని చెప్పిన, మధ్యవర్తి ఆ సంబంధాన్ని ఖరారు చేశాడు. మే 28న బాలికకు బలవంతంగా వివాహం జరిపించారు. అయితే ఈ వివాహం తనకు ఇష్టం లేదని, తాను చదువుకోవాలనుకుంటానని ఆ బాలిక చెబుతూ వచ్చినా.. తల్లి పట్టించుకోలేదు. దీంతో, ఆ బాలిక మంగళవారం తమ హైస్కూలు ప్రధానోపాధ్యాయుడికి మొరపెట్టుకుంది. దీనిపై వెంటనే స్పందించిన ఆయన ఆ బాలికను నందిగామ తహసీల్దార్ వద్దకు తీసుకెళ్లారు. తహసీల్దార్ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. బాలిక ఫిర్యాదు ఆధారంగా ఆమె తల్లి, వరుడు, మధ్యవర్తి, వివాహం జరిపించిన పూజారిపై బాల్య వివాహ నియంత్రణ చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం, బాలికను సురక్షితంగా రెస్క్యూ హోంకు తరలించారు. కాగా ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిరు మాదిరి లీకిచ్చిన రజినీ.. పాపం! లోకేష్!
నాగ్‌లోని గొప్ప విషయం అదే! కింగ్‌ను ఆకాశానికెత్తిన రజినీ..
నోరు జారిన రజినీ.. తప్పుడబుతున్న రాజమౌళి ఫ్యాన్స్
నేను నో చెప్పినా లోకేష్ వెంట పడ్డాడు.. కానీ ఆ ఒక్క విషయంలోనే బాధ
షాకింగ్ కిడ్నాప్ డ్రామా.. అసలు సంగతి తెలిసి పోలీసుల షాక్