దారుణం.. ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను చంపేసిన మ‌హిళ‌.. గుర్తు పట్టకుండా ఉండేందుకు ఏం చేశారంటే…

దారుణం.. ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను చంపేసిన మ‌హిళ‌.. గుర్తు పట్టకుండా ఉండేందుకు ఏం చేశారంటే…


నేటి సమాజంలో మనిషి మాయమైపోతున్నాడు అనిపిస్తుంది.. ఎందుకంటే.. మానవత్వం ఉన్న మనుషులు ఎక్కడో గానీ కనిపించటం లేదు. రోజురోజుకు మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. జీవితాంతం తోడు ఉంటానని పెద్దల సమక్షంలో పెళ్లినాడు ప్రమాణం చేసిన భార్య భర్తలు దారుణాలకు ఒడిగడుతున్నారు. కలిసి ఉండాల్సిన భార్య భర్తలు కడుపులో కక్ష పెంచుకుంటున్నారు. ఇటీవలి కాలంలో భార్యలు భర్తల పాలిట మృత్యువుగా మారారు. వివాహేతర సంబంధాలు, ఇష్టంలేని పెళ్లి చేశారనే కారణం.. లేక మరే ఇతర కారణాల వల్లో తాళికట్టిన భర్తలను పక్కా స్కేచ్‌తో హత్య చేసి కటకటాలపాలవుతున్నారు. ఇలాంటి ఘటన తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌కు చెందిన ఓ ఇల్లాలు తన భర్తను దారుణంగా హత్య చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

యూపీలో దారుణ ఘ‌ట‌న వెలుగు చూసింది. అలీఘ‌ర్‌కు చెందిన త‌బ‌స్సుమ్‌, యూసుఫ్‌కు తొమ్మిదేళ్ల క్రితం వివాహం జ‌రిగింది. ఇంతకాలం వీరి కాపురం సాఫీగానే సాగింది. కానీ, గత కొద్దిరోజుల క్రితం డానిష్ అనే వ్య‌క్తితో త‌బ‌స్సుమ్‌కు పరిచయం ఏర్పడింది. అలా వారు తరచూగా కలుసుకునే వారు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య అక్ర‌మ సంబంధానికి దారి తీసింది. అయితే, వీరి మధ్య ఉన్న సంబంధం గురించి తెలియటంతో భ‌ర్త యూసుఫ్‌ ఆమెను మంద‌లించాడు. దీంతో భ‌ర్తను చంపేందుకు ప్రియుడితో క‌లిసి త‌బ‌స్సుమ్ పక్కా ప్ర‌ణాళిక ర‌చించింది.
యూసుఫ్ ఒంట‌రిగా ఉన్న స‌మ‌యం చూసుకొని క‌త్తితో పొడిచి చంపేశారు. అనంత‌రం మృత‌దేహం మీద యాసిడ్ పోసి కాల్చేశారు. దీంతో పోలీసులు నిందితులు ఇద్ద‌రినీ అరెస్ట్ చేశారు.

పోలీసులు చెప్పిన వివరాల మేరకు…తబస్సుమ్‌ భర్తను విడిచిపెట్టి తన ప్రియుడితో వెళ్లాలనుకుంటున్నానని, తన భర్త దీనికి వ్యతిరేకించాడని పోలీసులకు చెప్పింది. అందుకే ఎలాగైన అడ్డుతొలగించుకోవాలని అనుకున్నారు. ప్రియుడి సాయంతో భర్త అడ్డుతొలగించుకున్నట్టుగా పోలీసులు తేల్చారు.

ఇవి కూడా చదవండి

అయితే, యూసుఫ్ మృతదేహం పోస్ట్‌మార్టం నివేదికలో అతన్ని దారుణంగా హత్య చేసినట్లు వెల్లడైంది. పోలీసుల ప్రకారం, మొదట అతని రెండు చేతులు కట్టి, తరువాత అతని కడుపుపై పదునైన ఆయుధంతో దాడి చేశారు. అతన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేదుకు అతని శరీరం మీద మొత్తం యాసిడ్ పోశారు. కానీ, పోలీసులు అతన్ని బట్టలు. చెప్పుల ద్వారా మృతదేహాన్ని గుర్తించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *