తొలుత డర్టీ ఫొటోలు.. ఆపై డ్రెస్ ఛేంజ్ రూంలో బలవంతపు ముద్దులు.. సీన్ కట్‌ చేస్తే..

తొలుత డర్టీ ఫొటోలు.. ఆపై డ్రెస్ ఛేంజ్ రూంలో బలవంతపు ముద్దులు.. సీన్ కట్‌ చేస్తే..


క్రికెట్ ప్రపంచానికి సంబంధించిన ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇది అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక కోచ్‌పై తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీని కారణంగా అతనిపై కీలక చర్యలు తీసుకున్నారు. ఈ కోచ్ ఇద్దరు జూనియర్ మహిళా సహోద్యోగులతో లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దీనిని కోచ్ కూడా అంగీకరించాడు. దీని కారణంగా అంతర్జాతీయ క్రికెట్ క్రమశిక్షణా ప్యానెల్ అతన్ని సస్పెండ్ చేసింది.

కోచ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు..

లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలపై మాజీ కౌంటీ క్రికెట్ కోచ్‌ను తొమ్మిది నెలల పాటు క్రికెట్ నుంచి సస్పెండ్ చేశారు. 2023, 2024లో జరిగిన సంఘటనలకు సంబంధించి ఐదుసార్లు వృత్తిపరమైన ప్రవర్తనా నియమాలను ఉల్లంఘించినట్లు కోచ్ అంగీకరించిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ క్రమశిక్షణా ప్యానెల్ ఈ నిర్ణయం తీసుకుంది. వీటిలో ఇద్దరు జూనియర్ మహిళా సహోద్యోగులకు అశ్లీల ఫోటోలను పంపడం, క్లబ్ దుస్తులు మార్చుకునే గదిలో ఒక మహిళను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించడం ఉన్నాయి.

కోచ్ పేరు వెల్లడించలే..

అంతర్జాతీయ క్రికెట్ క్రమశిక్షణా ప్యానెల్ కోచ్ పేరును బహిరంగంగా వెల్లడించకూడదని నిర్ణయించింది. ఆరోగ్య సమస్యతోపాటు పేరు బయటపెడితే హాని కలిగే ఛాన్స్ ఉందని కోచ్ పేరును వెల్లడించలేదని ప్యానెల్ తెలిపింది. కోచ్ ప్రవర్తన కారణంగా ఇప్పటికే అతనిని తొలగించారు. అప్పటి నుంచి క్రికెట్‌లో పాల్గొనలేదు. ఆరు నెలల సస్పెన్షన్ అతనిపై ఆరోపణలు వచ్చినప్పటి నుంచి లెక్కించబడుతుంది. మిగిలిన మూడు నెలలు 12 నెలల పాటు సస్పెండ్ చేయనుంది.

ఇవి కూడా చదవండి

ఈ కోచ్ బాధితుల్లో ఒకరికి అసభ్యకరమైన సందేశాలు పంపాడు. బాధితురాలి ఆగ్రహించడంతో కొన్ని రోజులు కామ్‌గా ఉండిపోయాడు. కానీ కొన్ని రోజుల తర్వాత అతను మళ్ళీ అసభ్యకరమైన సందేశాలు పంపాడు. అదే సమయంలో, రెండవ బాధితురాలు కోచ్ కంటే చాలా చిన్నది. ఆమె పని విషయంలో అతన్ని కలిసేది. అతను ఆమెకు అశ్లీల ఫోటోలను కూడా పంపాడు. దానికి ఆమె స్పందించలేదు. తరువాత ఆమెను దుస్తులు మార్చుకునే గదిలో చెత్త ఉందని, అక్కడి వెళ్లి క్లీన్ చేయాలంటూ ఆదేశించాడు. అక్కడ కోచ్ బాధితురాలిని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించడంతో ఈ చర్య తీసుకున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *