ఇందుకు ఎనివేర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకున్నారు. పద్మజ చనిపోయినా తప్పుడు పత్రాలు సృష్టించి ఆమె జీపీఏ చేసినట్లు డాక్యుమెంట్లు తయారు చేశారు. వాటిని నర్సరావుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ చేయించారు. ఈ తతంగమంతా 2023 అక్టోబర్‌లో పూర్తి చేశారు. ఏకంగా జీపీఏ సాయంతో రిజిస్ట్రేషన్లు చేసేశారు. ఈ రిజిస్ట్రేషన్ల్నీ కూడా నర్సరావుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే చోటు చేసుకున్నాయి. జీపీఏ తయారు కావడంతో మాఫియా ఆ భూమిని అమ్మకానికి పెట్టింది. ఈ విషయాన్ని ఆలస్యంగా పసిగట్టిన పద్మజ భర్త శ్రీనివాసరావు తమ భూమిపై కబ్జా రాయుళ్లు కన్నేశారన్న విషయాన్ని 2024లోనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఎన్నికల హడావుడి ప్రారంభం కావడంతోనే పోలీసులు శ్రీనివాసరావు ఫిర్యాదుపై దృష్టి పెట్టలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధితుడు మంత్రి లోకేష్ కార్యాలయానికి వెళ్లి భూ మాఫియాపై ఫిర్యాదు చేశాడు. లోకేష్ ఆదేశాలతో కదిలిన నల్లపాడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నలభై కోట్ల రూపాయల విలువైన భూమిని కబ్జా చేసి విక్రయించిన మాఫియాలో కింగ్ పిన్ అయిన మహేష్ రెడ్డిని అరెస్ట్ చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా మహేష్ రెడ్డి అన్ని విషయాలు బయటపెట్టాడు. చనిపోయిన పద్మజ స్థానంలో ఒక వితంతువును తీసుకొచ్చి ఆమె పద్మజ అన్నట్లు నర్సరావుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నమ్మించారు. ఆమె పేరు మీదే జీపీఏలు ఉన్నట్లు సబ్ రిజస్ట్రార్‌కు చెప్పారు. వీటి ఆధారంగా భూమిని విక్రయించి రిజిస్ట్రేషన్ చేశారు. అయితే రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత తప్పు జరిగినట్లు గుర్తించిన అప్పటి సబ్ రిజిస్ట్రార్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మరోవైపు మహేష్ రెడ్డిపై ఐదు చీటింగ్ కేసులున్నాయని నల్లపాడు పోలీసులు తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసిన భూమిని కొద్దికాలం కిందట కబ్జా చేసేందుకు మహేష్ రెడ్డి, అతడి అనుచరులు ప్రయత్నాలు చేశారు. సీసీ కెమెరాల్లో కబ్జా ప్రయత్నాలు రికార్డు అయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు మహేష్ రెడ్డిని గుర్తించి అరెస్ట్ చేశారు. మంత్రి లోకేష్ ఆదేశాలతో కబ్జా అయిన తన భూమి తిరిగి తనకు దక్కడంపై భూ యజమాని శ్రీనివాసరావు సంతోషం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kohinoor: కోహినూర్ పుట్టింది ఎక్కడ ?? అది బ్రిటిషర్ల చేతికి ఎలా చిక్కింది ??
నా కూతరు మెంటల్ డిజార్డర్‌తో బాధపడుతోంది! అసలు నిజం బయటపెట్టిన కల్పిక తండ్రి
Ghaati: దిక్కులేకుండా ఘాటి ?? ఈ తొందరపాటు నిర్ణయాలు ఎందుకు ??
ఒక్క డైలాగ్ దెబ్బకు రిలీజ్ ఆగిపోయిన యోగి సినిమా! అలుపెరగకుండా పోరాడుతున్న టీం
రణబీర్ కపూర్ కంటే అంత గొప్పగా ఏం యాక్టింగ్ చేశావ్? నీకెలా నేషనల్ అవార్డ్ వచ్చింది?