‘‘నువ్వు నన్ను నమ్మినందుకు నేను ఎవ్వరితోనూ మాట్లాడలేదు.. దేవుని సాక్షిగా చెబుతున్నా.. కొడుకు సాక్షిగా చెబుతున్నా.. మా అమ్మ.. నీ సాక్షిగా చెబుతున్నా.. పెళ్లి అయినా దగ్గరి నుంచి నేను ఎవ్వరితోనూ మాట్లాడలేదు.. నేను తప్పు చేయాలనుకుంటే.. నువ్వు చేసిన తప్పులకు .. నేను ఆ నాడే చేద్దును.. కానీ.. అలా చేయలేదు.. నా కొడుకు జాగ్రత్త.. నీ వేధింపులతో పిచ్చి పడుతోంది.. నేను మరణించాక నువ్వు మంచిగా ఉండు. టెన్షన్ పడకు.. నేను చచ్చిపోయాకా.. నా ఫోన్ చెక్ చేసుకో.. అప్పుడన్నా అర్థం అవుతదిరా తేజు..’’ అంటూ భర్త వేధింపులతో విసిగిపోయిన ఓ వివాహిత.. సెల్ఫీ వీడియో తీసుకుని బలవన్మరణాని పాల్పడింది.. ఆమె మరణానికి ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో.. అందరినీ కంట తడి పెట్టిస్తోంది.. ప్రేమించి పెళ్లి చేసుకుని.. చివరకు భర్త అనుమానం.. వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకోవడంతో.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
కేశవపట్నం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా తాడికల్‌కు చెందిన 27ఏళ్ల గొట్టె శ్రావ్య రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలానికి చెందిన అమ్మిగల్ల ధర్మతేజ్‌ను ప్రేమించి 2020లో వివాహం చేసుకుంది. తరువాత వారిద్దరూ బోయినపల్లిలో నివాసముంటున్నారు.. వీరికి ఓ బాబు ఉన్నాడు.. ఈ క్రమంలోనే.. ధర్మతేజ్ రెండున్నరేళ్ల క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అప్పటినుంచి శ్రావ్య కొడుకుతో కలిసి తాడికల్‌లోనే ఉంటోంది. అంతా బాగానే ఉందనుకున్న క్రమంలో… కొంతకాలంగా ధర్మతేజ్ కు శ్రావ్యపై అనుమానం మొదలైంది..
దుబాయ్‌లో ఉన్న తేజ్ తరచూ ఫోన్ చేసి.. వేరే వారితో మాట్లాడుతున్నావంటూ శ్రావ్యను మానసికంగా హింసించేవాడు.. భర్త వేధింపులు పెరగడంతో శ్రావ్య తీవ్ర మనస్తాపానికి గురైంది.. దీంతో శ్రావ్య మంగళవారం ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.. అంతకుముందు సెల్ఫీ వీడియో తీసుకుంది.. ఈ వీడియోలో నిద్ర మాత్రలు మింగింది.. అనంతరం ఆమె ఉరి వేసుకుని చనిపోయింది..
వీడియో చూడండి..
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. శ్రావ్య సోదరుడు శివకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కేశవపట్నం పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..