Headlines

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో హస్తం హవా.. పదుల సంఖ్యలో హంగ్ పరిస్థితులు..

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో హస్తం హవా.. పదుల సంఖ్యలో హంగ్ పరిస్థితులు..


తెలంగాణలో మున్సిపల్ పోరు ముగిసింది. కొన్ని కార్పొరేషన్లు మినహా ఓట్ల లెక్కింపు దాదాపు పూర్తయినట్లే. కొన్నిచోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్… మరికొన్నిచోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్‌ఎస్.. ముక్కోణపు పోటీ నడిచింది. టోటల్‌గా అధికారపార్టీకి అనుకూలంగా వచ్చింది పట్టణ ఓటరు తీర్పు. మొత్తం 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగితే, అందులో కాంగ్రెస్ 68, బీఆర్ఎస్ 14 చోట్ల గెలిస్తే, 33 మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలకు సమానమైన సీట్లొచ్చి హంగ్ ఏర్పడింది. గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో అనూహ్యంగా ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలిచింది. బీజేపీ ఐతే బోణీ కొట్టలేదు.

మున్సిపాలిటీల్లో మొత్తం వార్డుల సంఖ్య 2 వేల 581. వీటిలో కాంగ్రెస్ పార్టీ ఖాతాలో అత్యధికంగా 1 వెయ్యీ 346 వార్డులు పడ్డాయి. 723 వార్డుల్లో బీఆర్ఎస్ గెలిచింది. బీజేపీ 261, ఇతరులు 252 వార్డుల్ని సొంతం చేసుకున్నారు. నేరేడుచర్ల మున్సిపాలిటీలోని 14వ వార్డు నుంచి జనసేన అభ్యర్థి ఆరూరి విజయలక్ష్మి 60 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ 10వ వార్డులో తెలుగుదేశం అభ్యర్థి బోడేపూడి రేవతి గెలిచారు.

మొత్తం 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరిగితే, అందులో నాలుగు కార్పొరేషన్లు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లను బీజేపీ గెల్చుకుంది. బీఆర్ఎస్ ఖాతా తెరవనేలేదు. కానీ, కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కీ, సీపీఐకీ చెరి 22 డివిజన్లు రావడంతో హంగ్ ఏర్పడింది.

ఇవి కూడా చదవండి

సో, పిక్చర్ అభీ బాకీ హై.. అంటోంది మున్సిపల్ యుద్ధం. ఏ ఒక్క పార్టీకి సంపూర్ణ విజయాన్ని కట్టబెట్టకుండా, టూ ఇంటిలిజెంట్ అనిపించాడు పట్టణ ఓటరు. 33 మున్సిపాలిటీల్లో, ఒక కార్పొరేషన్లో హంగ్ సిట్యువేషన్ రావడంతో క్యాంపు రాజకీయాలు షురూ ఔతాయి కనుక, క్లయిమాక్స్ కోసం మరికొన్నాళ్లు వెయిటింగ్ తప్పదన్నమాట.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *