తాను మరణించి మరో ఆరుగురికి వెలుగులు పంచి యువకుడు.. తల్లిదండ్రుల ఔదార్యానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే..

తాను మరణించి మరో ఆరుగురికి వెలుగులు పంచి యువకుడు.. తల్లిదండ్రుల ఔదార్యానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే..


తాను మరణించి మరో ఆరుగురికి వెలుగులు పంచి యువకుడు.. తల్లిదండ్రుల ఔదార్యానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే..

ఒకరి అవయవదానం. ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. ప్రమాదంలో కుమారుడు దూరమైనా, ఐదు కుటుంబాలకు జీవనాధారం కోసం ముందుకు వచ్చిన అవయవ దాత తల్లిదండ్రులకు అందరూ కృతజ్ఞతలు తెలిపారు. యాక్సిడెంట్లో మృతి చెందిన కందిమళ్ల విజయ్ కుమార్ ఐదు మందికి అవయవ దానాలు చేసి వారి ప్రాణాలు నిలిపిన విజయ్ కుమార్ కు నిజమైన జోహార్లు.

ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన కందిమళ్ల విజయకుమార్ (20) ఏపీ లోని తాడేపల్లి మండల పరిధిలోని వడ్డేశ్వరం కేఎల్ యూ లో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 6న బైక్ పై వెళుతూ ప్రమాదానికి గురయ్యాడు. మణిపాల్ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతున్న విజయ్ ఈ నెల 11న బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో అవయవ దానం కోసం డాక్టర్లు కుటుంబ సభ్యులకు వివరించారు..చేతికి వచ్చిన కొడుకు కానరాని లోకాలకు వెళ్ళడంతో..వారు గుండెలవిసేలా రోదిస్తూ..బాధను దిగమింగుకుని విజయ్ తండ్రి సైదేశ్వరరావు, కుటుంబసభ్యుల అంగీకారం మేరకు ఏపీ జీవన్దాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అవయవదానం నిర్వహించారు.

దాత గుండె, కాలేయాన్ని మణిపాల్ హాస్పిటల్ లో అవసరమైన వారికి అమర్చారు. ఊపిరితిత్తులను హైదరాబాద్ లోని కిమ్స్ వైద్యశాలకు, కిడ్నీలను గుంటూరు విధాత హాస్పిటల్ కు, కార్నియాను విజయవాడలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు చేతికి వచ్చిన కొడుకు ప్రమాదంలో మృతి చెందిన కూడా మరో ఐదుగురికి ప్రాణం పోసాడని కడుపు శోకంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *