రాజన్న సిరిసిల్ల జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన రాష్ట్ర ఎన్నికల సంఘం రాపిడ్ ఎనేబుల్‌మెంట్ అబ్జర్వర్ గా ఐఏఎస్ అధికారి మంద మకరంద్‌కు ఓ ప్రత్యేకమైన అనుభూతి ఎదురైంది. అధికారిక పర్యటనగా ప్రారంభమైన ఆ సందర్శన… భావోద్వేగ క్షణాలుగా మారింది. సిరిసిల్ల పట్టణంలోని కాకతీయ హైస్కూల్‌లో 39వ వార్డు పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించడానికి వచ్చిన ఆయనకు అక్కడి వాతావరణం కొత్తగా కాకుండా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసింది. ఎందుకంటే అదే పాఠశాలలో చదువుకున్న విద్యార్థి… ఈరోజు ఐఏఎస్ అధికారి హోదాలో తిరిగి అదే ప్రాంగణంలో అడుగుపెట్టారు. పాఠశాలకు చేరుకున్న మకరంద్‌కు విద్యార్థులు పూలతో స్వాగతం పలకగా ఉపాధ్యాయులు, యాజమాన్యం ఆనందం వ్యక్తం చేశారు. ఒకప్పుడు క్లాస్‌రూమ్‌లో కూర్చుని పాఠాలు నేర్చుకున్న విద్యార్థి… ఇప్పుడు ఐఏఎస్ అధికారిగా పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించడాన్ని చూసి అందరూ గర్వంగా భావించారు. పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం విద్యార్థులతో కాసేపు ముచ్చటించిన మకరంద్, తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. “నేను కూడా మీలాగే ఈ స్కూల్లోనే చదివాను… లక్ష్యం పెట్టుకుని కష్టపడితే మీరూ ఉన్నత స్థానాలకు చేరుకుంటారు” అంటూ విద్యార్థులకు ప్రేరణనిచ్చారు. పెద్ద కలలు కనాలని, వాటి కోసం క్రమశిక్షణతో చదవాలని సూచించారు. ఈ సంఘటన విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా, ఉపాధ్యాయులు కూడా ఇది తమకు గర్వకారణమని తెలిపారు. ఒక సాధారణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి ఐఏఎస్‌గా ఎదిగి అదే పాఠశాలకు తిరిగి రావడం… అక్కడ చదువుతున్న పిల్లలకు ప్రత్యక్ష స్ఫూర్తిగా నిలిచింది.మున్సిపల్ ఎన్నికల పరిశీలనలో భాగంగా వచ్చిన అధికారిక పర్యటన రోజు కాకతీయ హైస్కూల్‌కు స్ఫూర్తి దినంగా మారింది. “ఈ పాఠశాలలో నుంచే ఐఏఎస్ అవ్వొచ్చు” అనే నమ్మకాన్ని పిల్లల మనసుల్లో నాటిన రోజు గా నిలిచిపోయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jabardasth Mahidhar: నీ డ్రామాలన్నీ వ్యూస్ కోసమేగా..? మహీని తిట్టిపోస్తున్న నెటిజన్లు
ఎట్టకేలకు రవితేజ కూడా వస్తున్నాడు.. ఎప్పుడంటే ??
Gold Price Today: ఏ మాత్రం తరగని బంగారం వెండి, ధరలు.. ఈ రోజు ఎంతంటే
Hyderabad: హైదరాబాద్‌లో భూ ప్రకంపనలు..
నిర్దోషిగా తేలిన కొన్ని గంటలకే కానిస్టేబుల్ మృతి