రజనీకాంత్, కమల్ హాసన్ భారతీయ సినిమా చరిత్రలో ఈ స్టార్స్ కు ప్రత్యేక పేజీలు ఉంటారు. ఈ నటులు దాదాపు ఐదు దశాబ్దాలుగా తమిళ చిత్ర పరిశ్రమను ఏలుతున్నారు. తమ నటన, స్టైల్ తో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఎన్నో సినిమాల్లోనూ నటించారు. దాదాపు 20కు పైగా సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ సుమారు 35 సంవత్సరాల తర్వాత ఒక సినిమాలో కలిసి యాక్ట్ చేస్తున్నారు రజనీ, కమల్. ఈ మల్టీ స్టారర్ సినిమాను స్వయంగా కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. కమల్ హాసన్ కు చెందిన సొంత నిర్మాణ సంస్థ ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ భారీ బడ్జెత్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.అలాగే కమల్ కూడా ఈ మూవీలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తారని పుకార్లు వచ్చాయి, కానీ అది ఇప్పుడు అబద్ధమని తేలింది. తాను ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం లేదని లోకేష్ స్వయంగా చెప్పారు. ‘మహారాజా’ చిత్రంతో భారీ హిట్ ఇచ్చిన నితిలన్ స్వామినాథన్ దీనికి దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరిగింది. కానీ అది కూడా నిజం కాదని క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో ‘జైలర్’ తో స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిన నెల్సన్ దిలీప్ కుమార్ ఇప్పుడు ఈ భారీ మల్టీస్టారర్ చిత్రానికి దర్శకత్వం వహించే బాధ్యతను తీసుకున్నారని టాక్.
కాగా రజనీ- కమల్ ల సినిమా టైటిల్ ప్రోమో షూటింగ్ రేపు (ఫిబ్రవరి 14) పూర్తవుతుందని చెబుతున్నారు. అలాగే ఈ ప్రాజెక్టు గురించి ఏదైనా అప్డేట్ కూడా రావొచ్చని చెబుతున్నారు. కాగా నెల్సన్ దిలీప్ కుమార్ ప్రస్తుతం ‘జైలర్ 2’ సినిమాతో బిజీగా ఉన్నారు. దీని తర్వాతనే ఆయన కమల్- రజనీల ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరికీ సమాన ప్రాధాన్యం ఉండేలా నెల్సన్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మెగా ప్రాజెక్ట్ కోసం రజనీకాంత్ తీసుకుంటోన్న పారితోషికంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ సినిమా కోసం రజనీకాంత్ 225 కోట్ల రూపాయల భారీ పారితోషికం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. స్నేహితుడు, నిర్మాత కమల్ హాసన్ కూడా రజనీకి ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు రెడీ అయ్యారని కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది.
ఇవి కూడా చదవండి
Marking half a century of cinematic brilliance, my dear friend @rajinikanth celebrates 50 glorious years in cinema today. I celebrate our Super Star with affection and admiration, and wish #Coolie resounding global success befitting this golden jubilee.
Helmed by the powerhouse… pic.twitter.com/FrU5ytphoL
— Kamal Haasan (@ikamalhaasan) August 13, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.