ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అనేది సామెత. కానీ ప్రస్తుత కాలంలో ఈ సామెతకు కాలం చెల్లిందా అన్నట్టుగా మారిపోయాయి పరిస్థితులు. ఎంతటి దొంగనైనా.. ఇట్టే పట్టేస్తున్నాయి నిఘా నేత్రాలు. తను ఎంతో నమ్మకంగా పనిచేసే ఇంట్లోనే చోరీకి పాల్పడిన ఇంటి దొంగ ఆట కట్టించాయి ఆ ఇంటి సీసీ కెమెరాలు. ఈ దొంగ కథాకమామీషు ఏంటో చూద్దాం. మహిళలు టీవీలో వచ్చే సీరియళ్లకు ఎంతగా కనెక్ట్ అయిపోయారో ఈ ఘటన మరోసారి రుజువు చేస్తోంది. మనోళ్లు సీరియల్ చూడ్డం మొదలు పెడితే చుట్టూ ప్రపంచం మునిగిపోతున్నా పట్టించుకోరంటారు. అంతగా లీనమైపోతారు. దాన్నే అవకాశంగా మలచుకున్నాడు ఆ ఇంట్లో పనిచేసే డ్రైవర్. కనెకోరుకొండ మండలం శ్రీరంగపట్నం సర్పంచ్ మద్దాల అమ్మాయి, రమణ దంపతుల ఇంట్లో 20 మంది సభ్యులతో కూడిన పెద్ద ఉమ్మడి కుటుంబం ఉంటుంది. ఆ ఇంట్లోనే డ్రైవర్‌గా చేరిన కొండలరావు, కుటుంబ సభ్యుల అలవాట్లను గమనించాడు. ప్రతిరోజూ మహిళలందరూ హాల్‌లో కూర్చుని టీవీ సీరియల్స్ చూసే సమయాన్ని తనకు అనువుగా మార్చుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా దఫా దఫాలుగా 12 కాసుల బంగారం, 4 లక్షల నగదు దోచేశాడు. ఇంట్లో నగదు, నగలు మాయమవుతుండటంతో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రాకూడదని భావించిన సర్పంచ్ దంపతులు, పోలీసుల సూచనతో రహస్యంగా సీసీ కెమెరాలు అమర్చారు. మరోసారి దొంగతనానికి ప్రయత్నించిన కొండలరావు, కెమెరాను చూసి టోపీతో కప్పి తప్పించుకోవాలని చూసినా ఫలితం లేకపోయింది. నిందితుడి కదలికలను గుర్తించిన బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన డీఎస్పీ శ్రీకాంత్ బృందం దర్యాప్తు చేపట్టి, నిందితులు కొండలరావు, అనిల్ కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారు విక్రయించిన 12 కాసుల బంగారు ఆభరణాలను, లక్ష రూపాయల నగదును 24 గంటల్లోనే రికవరీ చేశారు. నమ్మిన వ్యక్తి ఇలాంటి దారుణానికి ఒడిగట్టడంపై సర్పంచ్ రమణ ఆవేదన వ్యక్తం చేస్తూ.. నిందితుడికి తగిన గుణపాఠం లభించిందని పేర్కొన్నారు. తక్కువ ధరకు వస్తుందని దొంగ బంగారం కొనుగోలు చేసే షాపు యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైతు ఇంట సిరులు కురిపిస్తున్న పంట !! అధిక దిగుబడితో సంతోషం
Goli Soda: సింగరేణి కార్మికుల ఆరోగ్య రహస్యం.. అసలుసిసలు గోలీ సోడా చేసే మేలు తెలుసా ??
మోగనున్న పెళ్లి బాజాలు.. అత్యంత శుభ ముహూర్తాలు ఇవే
ప్రసవ వేదన భరించలేక గర్భిణి షాకింగ్ నిర్ణయం.. వామ్మో అలా ఎలా చేసావ్.. అమ్మా
చెత్తకుప్పలో రూ.15 లక్షల విలువైన నగలు.. ఊహించని ట్విస్ట్..