డ్రై క్లీనర్ మంత్లీ ఇన్‌కం.. రూ.2 లక్షలు నెట్టింట వైరల్‌గా పోస్ట్!

డ్రై క్లీనర్ మంత్లీ ఇన్‌కం.. రూ.2 లక్షలు నెట్టింట వైరల్‌గా పోస్ట్!


పెద్ద చదువులు చదివినా సరైన సంపాదన లేక ఇబ్బందిపడేవారు కొందరు. తమకు తెలిసిన వృత్తినే నమ్ముకుని లక్షలు ఆర్జించే వారు మరికొందరు. అలాంటి ఓ జంటను చూసి షాకైపోయిన ఓ కంటెంట్ క్రియేటర్ ఆ స్టోరీని నెట్టింట పంచుకున్నారు. ఇది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. నళినీ ఉనాగర్ అనే కంటెంట్ క్రియేటర్ తమ ఇంటి పక్కన డ్రైక్లీనింగ్ షాపు నిర్వహించే ఓ జంట నెలకు 2 లక్షల రూపాయలకు పైగా ఆదాయాన్ని సంపాదిస్తున్నట్లు చెప్పారు. నమ్మశక్యంగా లేకపోయినా ఇదే నిజమంటూ ఆ కంటెంట్ క్రియేటర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తోంది. సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో సమానంగా ఆయన సంపాదిస్తున్నారని తెలియడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాళ్లది సొంత షాపనీ అద్దె బాధ లేదనీ ఆ దంపతులు ఇద్దరూ కలిసి రోజుకు 350 జతల దుస్తులకు పైగా ఇస్త్రీ చేస్తారనీ పోస్ట్‌లో రాసుకొచ్చారు నళినీ. ఒక్కో బట్టకు 10 రూపాయల తీసుకుంటారనీ ఇక సూట్స్, ఛోళీ, ఖరీదైన చీరలు డ్రైక్లీనింగ్ చేసేందుకు ఒక్కోదానికి 350 రూపాయల వరకు చార్జ్ చేస్తారనీ ఇలాంటివి రోజుకు 20 వరకూ డ్రైక్లీనింగ్ చేస్తారనీ తెలిపారు. అలా ఇస్త్రీలపై రోజుకు 3500, డ్రైక్లీనింగ్‌పై మరో 7000 వరకూ వారికి వస్తాయనీ అంటే ఒక్క రోజు ఆదాయమే పది వేలు దాటిందని ఆశ్చర్యపోతూ ఆమె చెప్పారు. నెలకు మూడు రోజులు మాత్రమే సెలవు తీసుకుంటారనీ దీంతో, వారి నెల వారీ ఆదాయం దాదాపు 2.83 లక్షల రూపాయలు ఉంటుందనీ నళినీ తెలిపారు. ఇక వారి వద్ద ఇద్దరు హెల్పర్లు కూడా పనిచేస్తున్నారనీ ఇద్దరికీ కలిపి జీతాల కింద 40 వేల రూపాయలు పోతుందనీ తెలిపారు. వారిది సొంత ఇల్లే కాబట్టి అద్దె ఖర్చు లేదు. కరెంటు ఖర్చు మరో 6 వేలు ఇవన్నీ పోతే చేతిలో వారికి 2.3 లక్షల వరకూ మిగులుతున్నాయనీ ఇది పదేళ్ల అనుభవం ఉన్న టెకీ సంపాదనకు సమానం అని చెప్పారు. ఈ పోస్టుపై జనాలు పెద్ద ఎత్తున కామెంట్ చేశారు. చదువుకు, సంపాదనకు సంబంధం లేదనేందుకు ఇంతకు మించిన ఉదాహరణ లేదని చాలా మంది అభిప్రాయపడ్డారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గిన్నిస్ రికార్డు సృష్టించిన భారీ పాము: చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే

నీళ్లా.. అని లైట్‌ తీసుకోకండి.. విషయం తెలిస్తే షాకే

అదృష్టం, ఆనందం కలిసి రావాలంటే ఇంట్లో ఈ మొక్కలు పెంచండి

అనకాపల్లి అగ్నిప్రమాదం: గూడ్స్ రోడ్డులో మహిళా సజీవ దహనం

ఆంధ్రప్రదేశ్ పర్యటనలో బిల్‌ గేట్స్: ఉండవల్లిలో అరటి తోటల పరిశీలన



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *