ఆపదలో ఉన్న మనిషిని చూసి ముఖం చాటేసే నేటి రోజుల్లో, మూగజీవాల ప్రాణాలను కాపాడి తమ ఉదారతను చాటుకున్నారు విజయవాడ ట్రాఫిక్ పోలీసులు మరియు వీఎంసీ సిబ్బంది. డ్రైనేజీ కాలువలో చిక్కుకుని మృత్యువుతో పోరాడుతున్న రెండు ఎద్దులను సురక్షితంగా బయటకు తీసి, అందరి ప్రశంసలు అందుకున్నారు. విజయవాడ బి.ఆర్.టి.ఎస్ రోడ్ జంక్షన్ వద్ద ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న ఇరుకైన డ్రైనేజీ కాలువలో రెండు ఎద్దులు ప్రమాదవశాత్తు జారిపడ్డాయి. కాలువ సందు ఇరుకుగా ఉండటంతో అవి కదలలేక, బయటకు రాలేక ప్రాణభయంతో కొట్టుమిట్టాడాయి. సహాయం కోసం ఆ మూగజీవాలు చూస్తున్న చూపులు అక్కడున్న వారిని కలిచివేసాయి. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు తక్షణం అక్కడికి చేరుకున్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పక్కన పెట్టి, ముందు జీవాలను కాపాడాలని వీఎంసీ సిబ్బందిని అప్రమత్తం చేశారు. వెంటనే క్రేన్‌ను రంగంలోకి దించారు. కాలువలో ఇరుక్కుపోయిన ఎద్దులకు బెల్టులు కట్టడం కష్టమైనప్పటికీ, సిబ్బంది వాటిని నిమురుతూ శాంతింపజేసి అతి జాగ్రత్తగా క్రేన్ సాయంతో పైకి లేపారు. స్థానికులు కూడా ఈ సహాయక చర్యల్లో పాలుపంచుకోవడంతో ఆ ప్రాంతమంతా ఒకే కుటుంబంగా మారిపోయింది. గంటల తరబడి సాగిన ఈ పోరాటం తర్వాత రెండు ఎద్దులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డ్యూటీని మించి మానవత్వంతో స్పందించిన పోలీసులు, మున్సిపల్ సిబ్బందిపై సోషల్ మీడియాలో నెటిజన్లు మరియు జంతు ప్రేమికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ ఇద్దరు బ్యూటీస్ టైమ్ మొదలైంది.. హిట్ కొడితే దిమ్మ తిరగాల్సిందే
టాలీవుడ్ ను ఏలుతున్న తెలుగు బ్యూటీస్..
ఇలా ప్లాన్ చేసుకుంటే అందరికీ కష్టమే కదా బాసూ..?
A. R. Rahman: 30 ఏళ్ళ తర్వాత ఆ సినిమాతో తెలుగు లోకి అడుగుపెడుతున్న రెహ్మాన్
Allu Arjun: అల్లు అర్జున్ను టార్గెట్ చేసింది వాళ్లేనా