డ్రాగన్ నయా అస్త్రం.. ఇక శత్రు ఉపగ్రహాలకు చుక్కలే

డ్రాగన్ నయా అస్త్రం.. ఇక శత్రు ఉపగ్రహాలకు చుక్కలే


శత్రువు ఏ రూపంలో వచ్చినా ఎదుర్కొనేలా కొత్త ఆయుధాలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా తను శత్రువుగా భావించే స్టార్‌లింక్‌ శాటిలైట్‌ను మసి చేసేలా చైనా శక్తిమంతమైన ఆయుధాన్ని అభివృద్ధి చేసింది . భూమి నుంచే శాటిలైట్లను ధ్వంసం చేయగల హై-పవర్‌ మైక్రోవేవ్‌ వెపన్‌ సిస్టమ్‌ తయారుచేసింది. ఆ వివరాలను సౌత్‌ చైనా మార్నింగ్ పోస్ట్‌ అందించింది. క్షిపణులు, తుపాకులను మించిన ఆయుధాలపై పలు దేశాల సైన్యాలు దృష్టి పెట్టాయి. తక్కువ ఖర్చుతో శక్తివంతమైన ఆయుధాలను తయారుచేస్తున్నాయి. ఈ కాన్సెప్ట్‌తో చైనా సిద్ధం చేసింది హై-పవర్‌ మైక్రోవేవ్‌ వెపన్‌. TPG1000C డివైజ్‌ నుంచి సుదీర్ఘంగా మైక్రోవేవ్ పల్స్‌ జనరేట్ అవుతుంటాయి. నాలుగు మీటర్ల పొడవు, ఐదు టన్నుల వరకు బరువు ఉండే ఈ పరికరం.. ఒక నిమిషం పాటు 20 గిగావాట్ల శక్తిని ఎలాంటి ఆటంకం లేకుండా అందించగలదు. ప్రస్తుతం ఉన్న ఈ తరహా వ్యవస్థలు భారీ పరిమాణంతో.. కొన్ని సెకన్ల వరకు మాత్రమే శక్తిని ఉత్పత్తిచేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఎలన్‌ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ శాటిలైట్లపై చైనాలో ఎప్పటినుంచో ఆందోళన ఉంది. అవి దేశభద్రతకు ముప్పుగా మారాయని చైనా నిపుణులు హెచ్చరించారు. దాంతో స్టార్‌లింక్ కు కిల్లర్‌గా మైక్రోవేవ్‌ ఆయుధం వచ్చింది. భూదిగువ కక్ష్యలో ఉండే ఉపగ్రహాలకు ఈ మైక్రోవేవ్‌ వెపన్‌ అంతరాయం కలిగించగలదు. ధ్వంసం కూడా చేయగలదని మీడియా కథనం తెలిపింది. ట్రక్కులు, నౌకల మీద, ఆఖరికి అంతరిక్షం నుంచి కూడా మైక్రోవేవ్‌ వెపన్‌ను ప్రయోగించవచ్చని తెలుస్తోంది. TPG1000C కన్నా ముందు చైనా వద్ద హరికేన్ సిరీస్ హై పవర్ మైక్రోవేవ్‌ ఆయుధాలున్నాయి. స్వల్పశ్రేణి గగనతల రక్షణ కోసం వాటిని రూపొందించారు. అవి రెండు నుంచి మూడు కిలోమీటర్ల పరిమిత దూరంలో డ్రోన్లను లక్ష్యంగా చేసుకోగలవు. తాజాగా మైక్రోవేవ్‌ వెపన్ ద్వారా దీర్ఘశ్రేణి లక్ష్యాలను ఎదుర్కోగల వ్యవస్థను చైనా రూపొందించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అంతరిక్షంలో గూఢచర్యం.. భారత్ కు ఇప్పుడు ఈ సత్తా కూడా ఉంది

రక్తం మడుగులో భారతీయ విద్యార్థులు.. రష్యా స్టూడెంట్స్ హాస్టల్‌లో టీనేజర్ ఘాతుకం

Harsha Veena: పవన్ సార్.. ఒక్క ఛాన్స్ ప్లీజ్.. మీ దగ్గర మొత్తం బయట పెడత

స్టైల్ గా ఉరేసుకుంటూ రీల్ చేసిన మహిళ.. కట్ చేస్తే సీన్ రివర్స్

గాజు సీసాలో తిరుమల శ్రీవారి ఆలయ గోపురం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *