డెంగ్యూ వచ్చిన తర్వాత ప్లేట్‌లెట్లు ఎందుకు తగ్గుతాయి..? ఇలాంటి వారికే ఎక్కువ ప్రమాదమట..

డెంగ్యూ వచ్చిన తర్వాత ప్లేట్‌లెట్లు ఎందుకు తగ్గుతాయి..? ఇలాంటి వారికే ఎక్కువ ప్రమాదమట..


డెంగ్యూ అనేది ఏడిస్ ఈజిప్టి అనే దోమ కాటు ద్వారా వ్యాపించే వైరల్ వ్యాధి.. ఈ దోమ పగటిపూట కుడుతుంది.. ముఖ్యంగా ఉదయం.. సాయంత్రం వేళల్లో సంచరిస్తూ కుడుతుంది. డెంగ్యూ వైరస్ సోకిన వ్యక్తి రక్తం ద్వారా దోమ శరీరాన్ని చేరుకుంటుంది.. అదే దోమ ఆరోగ్యకరమైన వ్యక్తిని కుట్టినప్పుడు, వైరస్ అతని శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ వ్యాధి నాలుగు రకాల డెంగ్యూ వైరస్‌ల వల్ల వస్తుంది (DEN-1, DEN-2, DEN-3, DEN-4).. వర్షాకాలం, తదుపరి సీజన్లలో, అధిక తేమ ఉన్నప్పుడు, దోమల సంఖ్య పెరిగినప్పుడు డెంగ్యూ ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధి అంటువ్యాధి కాదు, అంటే, ఇది ఒకరి నుండి మరొకరికి నేరుగా వ్యాపించదు.. కానీ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది.

డెంగ్యూ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే, అది రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.. ప్లేట్‌లెట్ల సంఖ్యను వేగంగా తగ్గిస్తుంది. దీని కారణంగా, వ్యక్తికి జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, కీళ్ల నొప్పులు, చర్మపు దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన సందర్భాల్లో, ఇది డెంగ్యూ హెమరేజిక్ జ్వరం, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ రూపంలోకి రావచ్చు, దీనిలో రక్తపోటు తగ్గడం ప్రారంభమవుతుంది.. అలాగే అంతర్గత రక్తస్రావం ప్రమాదం పెరుగుతుంది. పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, ఇప్పటికే అనారోగ్యంతో ఉన్నవారు రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నందున ఎక్కువ ప్రమాదంలో ఉంటారు.. సకాలంలో చికిత్స చేయకపోతే, డెంగ్యూ కూడా ప్రాణాంతకం కావచ్చు.

డెంగ్యూ వచ్చిన తర్వాత ప్లేట్‌లెట్స్ ఎందుకు తగ్గుతాయి ?

ఢిల్లీ MCDకి చెందిన డాక్టర్ అజయ్ కుమార్ డెంగ్యూ వచ్చిన తర్వాత ప్లేట్‌లెట్స్ కౌంట్ ఎందుకు తగ్గుతుందో వివరించారు. డెంగ్యూ వైరస్ శరీరానికి చేరిన వెంటనే, రక్తంలో ఉన్న ప్లేట్‌లెట్ల సంఖ్యను వేగంగా తగ్గించడం ప్రారంభిస్తుంది. ప్లేట్‌లెట్లు అనేవి మన రక్తంలో ఉండే కణాలు.. ఇవి కోత లేదా గాయం తర్వాత రక్తం గడ్డకట్టడంలో సహాయపడతాయి.. రక్తస్రావాన్ని ఆపుతాయి. డెంగ్యూ వైరస్ శరీరంలోని రోగనిరోధక కణాలను గందరగోళానికి గురి చేస్తుంది.. దీని కారణంగా ఈ కణాలు వాటి స్వంత ప్లేట్‌లెట్‌లను శత్రువులుగా భావించి నాశనం చేయడం ప్రారంభిస్తాయి. అలాగే, ప్లేట్‌లెట్లు ఏర్పడే ఎముక మజ్జను కూడా వైరస్ ప్రభావితం చేస్తుంది. ఇది ప్లేట్‌లెట్ల ఉత్పత్తిని నెమ్మదిస్తుంది. దీంతో ప్లేట్‌లెట్స్ సంఖ్య భారీగా తగ్గుతుంది.

దీనితో పాటు, డెంగ్యూలో రక్త నాళాలు కూడా ప్రభావితమవుతాయి.. దీని కారణంగా ప్లేట్‌లెట్లు లీక్ అయి శరీరంలోని ఇతర భాగాలలో పేరుకుపోతాయి.. రక్తంలో వాటి సంఖ్య తగ్గుతుంది. ప్లేట్‌లెట్ల సంఖ్య ఎక్కువగా పడిపోతే, శరీరంలో రక్తస్రావం అయ్యే ప్రమాదం పెరుగుతుంది, ముఖ్యంగా ముక్కు, చిగుళ్ళు, మూత్రం లేదా మలంలో రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందువల్ల, డెంగ్యూ సమయంలో ప్లేట్‌లెట్ కౌంట్‌పై నిఘా ఉంచడం చాలా ముఖ్యం.

మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి ?

ఇంటి లోపల – చుట్టుపక్కల నీరు పేరుకుపోకుండా చూసుకోండి.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి.

శరీరాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించండి.

దోమల నివారణకు చర్యలు తీసుకోండి.. దోమల నివారణకు ఆరోగ్యకరమైన కాయిల్స్ వాడండి.

ఇంట్లో తలుపులు – కిటికీలకు దోమతెరలు లేదా వలలు ఏర్పాటు చేయండి.

మీకు జ్వరం లేదా ఇతర లక్షణాలు అనిపిస్తే.. వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *