
సోమవారం అర్ధరాత్రి ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ప్రమాదంలో సునీల్ కుమార్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే బంధువులు అతన్ని స్థానిక లాలా లజుపత్రి రావు మెమోరియల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో స్ట్రెచర్ పై అతన్ని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. ఆ సమయానికి అక్కడ విధుల్లో ఉన్న డాక్టర్ భూపేష్ కుమార్ రాయ్ ఏసీ వేసుకొని కుర్చీలోనే నిద్రపోతున్నాడు. దీంతో సునీల్ భార్య వైద్యుని దగ్గరికి వెళ్లి నిద్ర లేపేందుకు ప్రయత్నించింది. చిన్న బిడ్డతో సునీల్ భార్య వైద్యుడిని ఎంత ప్రాధేయపడినా భూపేష్ నిద్ర లేవలేదు. గంటల తరబడి వైద్యం అందకపోవడంతో రక్తస్రావంతో సునీల్ కన్నుమూశాడు. కాగా ఎమర్జెన్సీ వార్డులో డాక్టర్ నిద్రించడం సునీల్ భార్య ప్రాధేయపడిన సన్నివేశాలను రమేష్ బంధువులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఘటనపై ఎల్ ఎల్ ఆర్ ఎం మెడికల్ కాలేజ్ ఉన్నతాధికారులు స్పందించారు. డాక్టర్ భూపేష్ కుమార్ రాయ్ ను సస్పెండ్ చేసి ఈ ఘటనపై విచారణకు కమిటీ వేశారు. కాగా ఎమర్జెన్సీ వార్డులో విధులు నిర్వర్తించాల్సిన వైద్యుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని పట్టించుకోకుండా నిద్రించడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :