టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు తీసుకున్నముద్దాడ రవిచంద్ర

టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు తీసుకున్నముద్దాడ రవిచంద్ర


తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో సీబీఐ ఛార్జిషీట్ ఆధారంగా అనిల్ కుమార్ సింఘాల్‌ను ఈవో పదవి నుండి ప్రభుత్వం తప్పించింది. ప్రస్తుతం సీఎంఓలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న రవిచంద్రకు ప్రభుత్వం ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది. బాధ్యతలు చేపట్టే ముందు ముద్దాడ రవిచంద్ర దంపతులు క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ తొలుత శ్రీ వరాహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకున్న వారికి అదనపు ఈవో, సీవీఎస్ఓ, మరియు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఉదయం 10.08 గంటల శుభ ముహూర్తానికి శ్రీవారి సన్నిధిలో ఆయన ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక భక్తుడిగా తోటి భక్తులకు సేవ చేసే గొప్ప భాగ్యం నాకు కలిగిందని, భక్తులకు సేవ చేయడమే దేవుడికి చేసే సేవగా భావిస్తానని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. భక్తుల నమ్మకాన్ని, మనోభావాలను కాపాడుతూ, టీటీడీ బోర్డుతో కలిసి అందరి సలహాలు, సూచనలతో పారదర్శకంగా పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చదివింది లా.. గురుడు చేసే పని తెలిస్తే షాకే

మొహం నిండా గాయాలతో క్రికెటర్ బెన్ స్టోక్స్.. షాక్ లో అభిమానులు

నీ కోసం.. కొండనైనా కదిలిస్తా.. నటి సెలీనా జైట్లీ కన్నీటి పోరాటం

వెంటనే బోర్డర్ దాటండి.. ఇరాన్‌‌లోని అమెరికన్లకు పిలుపు

భాగ్యనగరం వేదికగా రికార్డులకెక్కిన మెగా ఐస్‌క్రీమ్ పార్టీ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *