టీటీడీకి హైదరాబాద్ ఐటీ కంపెనీ యజమాని భారీ విరాళం

టీటీడీకి హైదరాబాద్ ఐటీ కంపెనీ యజమాని భారీ విరాళం


తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి హైదరాబాద్‌కు చెందిన స్మార్ట్ సాఫ్ట్‌వేర్ అండ్ మోహన్ ఇండస్ట్రీస్ ఎండీ యలమంచిలి మదన్మోహన్ రావు మంగళవారం రూ.30 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.

సదరు విరాళాన్ని శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు, ఇతర ట్రస్టులకు వినియోగించాలని దాత చైర్మన్ ను కోరారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు.

సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుడిగా శ్రీ‌ కల్యాణ వేంకటేశ్వరస్వామి

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన మంగ‌ళ‌వారం ఉదయం 8 గంట‌లకు అనంతతేజోమూర్తి అయిన శ్రీనివాసుడు యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో సింహ‌ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.

వాహనం ముందు వృషభాలు, గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

సింహ వాహనం – ధైర్య సిద్ధి

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహ‌నాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంత‌మ‌వుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజ‌య‌ స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు చెబుతున్నారు.

రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు కటాక్షిస్తారు. వాహన సేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, విజివో గిరిధర్, ఏఈవో గోపినాథ్‌, సూపరింటెండెంట్ రాజ్‌కుమార్‌, కంకణ భట్టార్ బాలాజి రంగాచార్యులు, అర్చకులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్‌, ధ‌న శేఖ‌ర్‌, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *