టార్గెట్ ఫిక్స్.. AI రంగంలోకి అదానీ రాయల్ ఎంట్రీ.. విశాఖ తర్వాత నెక్ట్స్‌ స్టాప్ హైదరాబాదే..?

టార్గెట్ ఫిక్స్.. AI రంగంలోకి అదానీ రాయల్ ఎంట్రీ..  విశాఖ తర్వాత నెక్ట్స్‌ స్టాప్ హైదరాబాదే..?


అదానీ, గూగుల్, చంద్రబాబు.. ఈ ముగ్గురి మెగా కాంబినేషన్‌తో వచ్చిందే విశాఖ డేటా సెంటర్. ఇప్పుడు సేమ్ ఈక్వేషన్ రిపీట్. కాకపోతే చిన్న కరెక్షన్. అదానీ, మైక్రోసాఫ్ట్, రేవంత్‌రెడ్డి.. ఇది కూడా బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ కాబోతోంది. అదానీ అనౌన్స్ చేసిన 9 లక్షల కోట్ల రూపాయల ప్రత్యక్ష పెట్టుబడుల్లో హైదరాబాద్‌కు వాటా దక్కబోతోంది. అయ్యామ్ రెడీ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రౌండ్‌ వర్క్ సిద్ధం చేస్తున్నారు.

కార్పొరేట్ దిగ్గజం, అపర కుబేరుడు గౌతమ్ అదానీ.. తాజా ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ తెలుగు రాష్ట్రాలను ఎటెన్షన్‌లోకి తీసుకొచ్చింది. పునరుత్పాదక ఇంధనంతో నడిచే హైపర్ స్కేల్ AI డేటా సెంటర్స్ ఏర్పాటు కోసం.. ఏకంగా 100 బిలియన్‌ డాలర్లు ఖర్చు పెట్టబోతున్నట్టు ప్రకటించింది అదానీ గ్రూప్. అంటే, దాదాపు 9 లక్షల కోట్ల రూపాయలు. ఎనర్జీ సెక్టార్‌లో 2035లోగా లాంగ్‌టర్మ్ సార్వభౌమాధిపత్యం సాధించడమే లక్ష్యమట. ఇంటిలిజెన్స్ రెవల్యూషన్‌లో ఇండియాను గ్లోబల్ లీడర్‌గా నిలపాలన్నదే టార్గెట్‌గా పెట్టుకున్నారు.

అదానీ గ్రూప్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో గట్టిగానే పాగా వేసింది. గూగుల్‌తో కలిసి గిగావాట్ సామర్థ్యం కలిగిన అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ను విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తోంది. ఇటీవల భూమిపూజ కూడా జరిగింది. లేటెస్ట్ డెవలప్‌మెంట్ ఏంటంటే, మైక్రోసాఫ్ట్‌తో జతకట్టి, హైదరాబాద్, పూణే నగరాల్లో ఏఐ డేటా సెంటర్ల మౌలిక సదుపాయాలపై ఫోకస్ పెట్టింది అదానీ గ్రూప్. 100 బిలియన్ డాలర్ల ప్రత్యక్ష పెట్టుబడితో ఇటువంటి భారీ డేటా సెంటర్ ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా అనేకం వచ్చే ఛాన్సుంది. భారీ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ప్రకటించగానే అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 3 శాతం ఎగబాకాయి.

అదానీ గ్రూప్ నుంచి హైదరాబాద్ సౌండ్ అలా వినిపించిందో లేదో ఇలా అలర్ట్ అయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. వెంటనే రివ్యూ చేసి డేటా సెంటర్స్‌కు భూముల లభ్యత, భూసేకరణపై ఆరా తీశారు. డేటా సెంటర్లకు రాయితీలపై అధ్యయనం చేయాలని, వివిధ రాష్ట్రాల పాలసీలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. భూ కేటాయింపులో హేతుబద్ధత ఉండాలని, పరిహారం నిర్ణయంలో ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. రైతులతో మాట్లాడి సంతృప్తి కలిగేలా ప్యాకేజ్‌లు ఇవ్వాలన్నారు. భూమి ఎంత త్వరగా ఇస్తే కంపెనీలు అంత వేగంగా పనులు పూర్తి చేస్తాయని, ఆ మేరకు రైతుల్లో అవగాహన కల్పించారని కోరారు.

ప్రస్తుతం అదానీ గ్రూప్ ఆధీనంలో 2 గిగావాట్ల సామర్థ్యంతో పనిచేసే డేటా సెంటర్లు ఉన్నాయి. దాన్ని 5 గిగావాట్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా గూగుల్‌తో కలిసి ప్లాన్ చేసిందే విశాఖ ఏఐ డేటా సెంటర్. ఇప్పుడు మైక్రోసాఫ్ట్- అదానీ- తెలంగాణ సర్కార్ కాంబినేషన్‌లో రాబోతోంది హైదరాబాద్‌ మెగా డేటా సెంటర్.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *