జిమ్ వర్కవుట్లకు బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ గుడ్ బై.. టెన్నిస్, స్క్వాష్ కలిపితే వచ్చే ఆ క్రేజీ గేమ్ రహస్యాలివే!

జిమ్ వర్కవుట్లకు బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ గుడ్ బై.. టెన్నిస్, స్క్వాష్ కలిపితే వచ్చే ఆ క్రేజీ గేమ్ రహస్యాలివే!


జిమ్ వర్కవుట్లకు బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ గుడ్ బై.. టెన్నిస్, స్క్వాష్ కలిపితే వచ్చే ఆ క్రేజీ గేమ్ రహస్యాలివే!

తాజాగా ఆమె పోస్ట్ చేసిన వీడియోలో చురుకైన కదలికలతో, పర్ఫెక్ట్ షాట్లతో అదరగొడుతోంది. ఆ స్టార్ బ్యూటీ మరెవరో కాదు.. అలియా భట్. ప్రస్తుతం అలియాకు పిచ్చిగా నచ్చేసిన ఆ ఆట పేరే ‘పాడెల్’. ఈ ఆట విశేషాలు, దీనివల్ల కలిగే లాభాలు ఏంటో వివరంగా తెలుసుకుందాం..

పాడెల్ అనేది టెన్నిస్, స్క్వాష్ ల కలయికతో రూపొందిన ఒక ఆధునిక క్రీడ. దీనిని 1969లో మెక్సికోకు చెందిన ఎన్రిక్ కోర్కువెరా అనే వ్యాపారవేత్త కనిపెట్టారు. ఇది టెన్నిస్ కోర్టులో మూడో వంతు మాత్రమే ఉండే చిన్న కోర్టులో ఆడతారు. చుట్టూ గాజు లేదా నెట్ గోడలు ఉంటాయి. బంతి గోడకు తగిలి వెనక్కి వచ్చినా దానిని ఆడవచ్చు. టెన్నిస్ రాకెట్లలా కాకుండా, వీటికి తీగలు ఉండవు. టెన్నిస్ బాల్ కంటే కొంచెం మెత్తగా ఉండే బంతిని ఇందులో ఉపయోగిస్తారు. అండర్ హ్యాండ్ సర్వీస్ ఉండటం వల్ల ఏ వయసు వారైనా దీనిని సులభంగా నేర్చుకోవచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)

అలియా కేవలం ట్రెండ్ కోసం ఈ ఆట ఆడటం లేదు, దీని వెనుక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

  • నిరంతరం కదులుతూ ఉండటం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  • చురుకైన కదలికలు మెరుగుపడతాయి, శరీరం దృఢంగా మారుతుంది.
  • ఈ ఆట ఆడటం వల్ల మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
  • చేతులు, కాళ్లు, కోర్ కండరాలకు ఇది ఒక గొప్ప వ్యాయామం.

జాగ్రత్తలు తప్పనిసరి..

అలియా తన పాడెల్ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నప్పటికీ, ఇందులో కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరిగ్గా ఆడకపోతే ‘టెన్నిస్ ఎల్బో’ లేదా కాళ్లకు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. ఇంద్రాప్రస్థ అపోలో హాస్పిటల్స్ సీనియర్ సర్జన్ డాక్టర్ రాజేష్ మల్హోత్రా సూచన ప్రకారం.. ఇలాంటి క్రీడలు ఆడే ముందు వార్మ్-అప్, స్ట్రెచింగ్ మరియు కండరాల బలోపేత వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి. అప్పుడే కీళ్లు సురక్షితంగా ఉంటాయి. అలియా భట్ లాగా ఫిట్‌గా ఉండాలనుకునే వారికి పాడెల్ ఒక అద్భుతమైన ఆప్షన్. ఇది కేవలం వ్యాయామం మాత్రమే కాదు, గొప్ప వినోదం కూడా.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *