జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సీ, లికోపెన్లు అధిక మోతాదులో ఉంటాయి. ఇవన్నీ చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. ఇంకా ఈ ఆకుల్లో ఉండే పొటాషియం బీపీ లెవల్స్‌ను స్థిరంగా ఉంచుతుంది. జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది. కడుపులో ఉన్న బ్యాక్టీరియాని తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
బ్లడ్ షుగర్ ని కంట్రోల్ లో ఉంచుతుంది. ఇందులో ఉండే యంటీ ఆక్సిడెంట్ ఇమ్యూనిటీని పెంచుతాయి. ఇందులో ఉండే యంటీ ఇన్ఫ్లమేతరి లక్షణాలు మొహానికి మంచి గ్లో అందిస్తాయి.
శరీరంలో చేరుకొలస్ట్రాల్ని తొలగిస్తుంది. ముఖ్యంగా అమ్మాయిలకు పీరియడ్స్ పెయిన్ తగ్గిస్తుంది.
జామ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జామ ఆకులు జీర్ణవ్యవస్థను మెరుగుపర్చేందుకు, జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. కడుపు సంబంధిత సమస్యల్ని దూరం చేస్తుంది.
జామ ఆకులు షుగర్ ఉన్నవారికి మంచి ఔషధం. రోజూ ఉదయాన్నే రెండు జామ ఆకులు నమిలి తినటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఫలితంగా షుగర్ కంట్రోల్లో ఉంటుంది. జామ ఆకులు గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. జామ ఆకులు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తాయి.
జామ ఆకులు చర్మ సంరక్షణలోనూ అద్భుతంగా పనిచేస్తాయి. చర్మ సమస్యలను నయం చేసి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. నోటి పరిశుభ్రతకు కూడా మంచి మెడిసిన్ లా పనిచేస్తాయి. జామ ఆకులు నమిలి తినటం వల్ల నోటిలో బ్యాక్టీరియాను చంపి, పళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి. జామ ఆకులను జుట్టుకు సీరమ్ లాగా ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా, మృదువుగా మారుతుంది.