జాగ్రత్త గురూ.. ఉదయాన్నే శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..? ఆ వ్యాధి వచ్చినట్లే!

జాగ్రత్త గురూ.. ఉదయాన్నే శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..? ఆ వ్యాధి వచ్చినట్లే!


జాగ్రత్త గురూ.. ఉదయాన్నే శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..? ఆ వ్యాధి వచ్చినట్లే!

చెడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల కారణంగా, మధుమేహం (డయాబెటిస్) కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధి పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ బాధితులుగా మారుస్తోంది. వాస్తవానికి ఇది ఎప్పటికి నయం కానీ చాలా ప్రమాదకరమైన వ్యాధి.. ఇది క్రమంగా శరీరాన్ని బలహీనపరుస్తుంది. దీనిని సకాలంలో గుర్తించకపోతే, ఇది తీవ్రమైన రూపాన్ని తీసుకోవచ్చు. చాలా మంది పరిస్థితి మరింత దిగజారే వరకు దాని లక్షణాలను తెలుసుకోలేరు. కానీ ఉదయం వేళ శరీరంలో మధుమేహానికి సంబంధించి కొన్ని ప్రారంభ సంకేతాలు కనిపిస్తాయని మీకు తెలుసా..? తెలియకపోతే.. ఆ లక్షణాలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకోండి..

డయాబెటిస్ అనేది శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఒక దీర్ఘకాలిక వ్యాధి.. ఇది శరీరానికి తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేనప్పుడు లేదా ఇన్సులిన్ ను సరిగా ఉపయోగించలేనప్పుడు వస్తుంది.

డయాబెటిస్‌లో ఉదయాన్నే కనిపించే లక్షణాలు..

అలసట – బలహీనత

మీరు ప్రతి ఉదయం అలసిపోయి బలహీనంగా అనిపిస్తే.. అది ప్రమాద సంకేతం కావచ్చు. ఈ రకమైన లక్షణం మధుమేహాన్ని సూచిస్తుంది. ఉదయం శక్తి తక్కువగా ఉండటం అంటే శరీరంలో ఏదో సమస్య ఉందని అర్థం.. రక్తంలో అధిక చక్కెర స్థాయి కారణంగా, మీరు నీరసంగా లేదా శక్తి లేకపోవడంతో బాధపడవచ్చు.

తరచుగా దాహం..

మీరు ఉదయం నిద్రలేవగానే చాలా దాహం వేస్తుందా..? లేదా మీ నోరు త్వరగా ఎండిపోతుందా? అయితే, ఇది కూడా రక్తంలో అధిక చక్కెరకు సంకేతం కావచ్చు. చక్కెర స్థాయి పెరిగినప్పుడు, మూత్రపిండాలు మూత్రం ద్వారా అదనపు గ్లూకోజ్‌ను బయటకు పంపడానికి ప్రయత్నిస్తాయి.. దీనివల్ల శరీరంలో నీరు లేకపోతుంది. ఉదయం నుండి మీకు చాలా దాహం వేస్తుంది.. అంతేకాకుండా మీ నోరు త్వరగా ఎండిపోవడం ప్రారంభమవుతుంది.

అస్పష్టమైన దృష్టి..

అధిక రక్తంలో చక్కెర కళ్ళను కూడా ప్రభావితం చేస్తుంది. రక్తంలో చక్కెర పెరగడం వల్ల, కొన్నిసార్లు మనం సరిగ్గా చూడలేము. మీకు అకస్మాత్తుగా అస్పష్టంగా కనిపించడం ప్రారంభిస్తే, మీ రక్తంలో చక్కెర స్థాయి పెరిగే అవకాశం ఉంది. అస్పష్టమైన దృష్టి సమస్యను విస్మరించడం ఆరోగ్యానికి ప్రమాదకరం.

తరచుగా మూత్ర విసర్జన..

రక్తంలో అధిక చక్కెర స్థాయిలు మూత్రపిండాల ద్వారా ఎక్కువ నీటిని తొలగించడానికి కారణమవుతాయి.. దీని వలన తరచుగా మూత్ర విసర్జన జరుగుతుంది. తరచుగా మూత్ర విసర్జన చేస్తుంటే వైద్యులను సంప్రదించండి..

దీనితో పాటు, చేతులు లేదా కాళ్ళలో జలదరింపు లేదా చేతులు లేదా కాళ్ళు తిమ్మిరి.. అటువంటి లక్షణాలు డయాబెటిస్ సంకేతమని వైద్య నిపుణులు చెబుతున్నారు. మీరు ఉదయాన్నే ఈ లక్షణాలను చూస్తున్నట్లయితే.. వెంటనే వైద్యులను సంప్రదించి.. పరీక్షలు చేయించుకోండి..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *