ఆదివారం రోజు ఆరుగురు మహిళలు ఆ జలపాతం అందాలను ఆస్వాదించేందుకు వెళ్లారు. నెమ్మదిగా అక్కడి రాళ్లపైకి చేరుకొని అక్కడి ప్రకృతిలో పులకిస్తున్నారు. ఇంతలో, ఉన్నట్టుండి కొండ ఎగువ నుంచి కిందికి వచ్చే నీటి ఉధృతి పెరిగింది. దీనిని గమనించిన ఓ మహిళ వెంటనే బండరాయిని దాటి గట్టుకు చేరుకున్నది. ఆమె బాటలోనే మరో ముగ్గురు గబగబా బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు గానీ, ఆ హడావుడిలో పట్టుతప్పి నీటిలో పడ్డారు. అయితే, దీనిని గమనించిన స్థానికులు.. వారిని కాపాడారు. బీహార్‌లోని గయా జిల్లాలోని లంగురియా జలపాతం వద్ద జరిగిన ఈ ఘటన తాలూకూ వీడియో వైరల్ అయ్యింది. ఈ గందరగోళంలో ఏం చేయాలో తెలియక గందరగోళంలో పడిపోయిన మిగిలిన ఇద్దరు మహిళలనూ అక్కడి పర్యాటకులు అవతల గట్టుకు చేర్చారు. లంగురియా జలపాతం వద్ద ఇంత భారీ నీటి ప్రవాహాన్ని చూడటం ఇదే మొదటిసారి అని స్థానికులు తెలిపారు. మహిళలను కాపాడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరిన్ని వీడియోల కోసం :