Headlines

జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? మద్రాస్ హైకోర్టులో అధికారులు చెప్పిందేంటి..?

జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? మద్రాస్ హైకోర్టులో అధికారులు చెప్పిందేంటి..?


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత ఆస్తులపై ఆదాయ పన్ను శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లించకపోతే ఆస్తులను వేలం వేస్తామని మద్రాస్ హైకోర్టుకు ఐటీ శాఖ వివరించింది. జయ ఆస్తులకు సంబంధించి ఐటీ శాఖకి సుమారు ఇరవై కోట్లు పన్ను చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో జయ వారసులుగా ఉన్న దీప, దీపక్ ఇద్దరికి పన్ను చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు పంపించింది. ఐటీ శాఖ పంపించిన నోటీసులకు వ్యతిరేకంగా జయ మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

కాగా, జనవరి నెలాఖరు వరకు చెల్లించాల్సి ఉన్న ఆదాయపు పన్ను, ఆస్తి పన్ను సుమారు ఇరవై కోట్లకిపైగా ఉందని ఐటీ శాఖ అంచనా వేసింది. ఇప్పటివరకు కోటి పన్నెడు లక్షల వరకు మాత్రమే చెల్లించినట్టు ఐటీ అధికారులు కోర్టుకు తెలిపారు. అవినీతి కేసుకు సంబంధించి జయ ఆస్తులను సీజ్ చేశాం కాబట్టి ఆదాయపు పన్ను , ఆస్తి పన్ను చెల్లించకపోతే ఆ ఆస్తులను వేలం వేస్తామని కోర్టుకు ఐటీ శాఖ స్పష్టం చేసింది. మద్రాస్ హైకోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 18వ తేదీకి వాయిదా వేసింది. జయలలిత చనిపోయిన మరుసటి రోజు నుంచి ఆస్తులు ఎవరికి దక్కాలన్న విషయంలో చాలా రోజులు వివాదం నడిచింది. అయితే ఆమె ఆస్తులు మేనల్లుడు, మేనకోడలికే చెల్లుతాయని కోర్టు ప్రకటించింది. దీంతో ఐటీ శాఖ ఇద్దరికి పన్ను చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *