2026 జనవరి నెల టాలీవుడ్‌కు మిశ్రమ ఫలితాలను అందించింది. నెల ప్రారంభంలో విడుదలైన సైక్, సిద్ధార్థ్, వనవీర వంటి చిన్న చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయాయి. సంక్రాంతి సీజన్ జనవరి 9న ప్రభాస్ నటించిన రాజాసాబ్‌తో మొదలైంది. అయితే, రాజా సాబ్, భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రాలు నిరాశపరిచాయి. రవితేజ సినిమాకు మంచి టాక్ వచ్చినా పోటీ ప్రభావం చూపింది. భారీ అంచనాలతో వచ్చిన మన శంకరవరప్రసాద్ గారు ఇండస్ట్రీ హిట్ కొట్టి సంక్రాంతి విజేతగా నిలిచింది. మెగా వింటేజ్‌కు అనిల్ కామెడీ మ్యాజిక్ వర్కవుట్ అయింది. అనగనగా ఒక రాజు చిత్రం కూడా మంచి విజయం సాధించింది. సంక్రాంతి సీజన్ కాకపోయినా శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. తరుణ్ భాస్కర్ ఓం శాంతి శాంతి శాంతికి మంచి టాక్ వచ్చినా వసూళ్లకు నోచుకోలేదు. మొత్తంగా జనవరిలో బాక్సాఫీస్ వద్ద దాదాపు ₹600 కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. ఫిబ్రవరిలో యుఫోరియా (ఫిబ్రవరి 6న), ఫంకీ (ఫిబ్రవరి 13న), కపుల్ ఫ్రెండ్లీ (ఫిబ్రవరి 14న), హే భగవాన్ (ఫిబ్రవరి 20న) వంటి చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ విచిత్ర జంతువును చూశారా ?? గుడ్లు పెట్టి.. పాలు ఇస్తుంది
రోజుకు రూ.21 వేల సంపాదన.. జస్ట్ అదే చేసిన ఇన్‌ఫ్లూయెన్సర్
నడిరోడ్డుపై షాకింగ్ సీన్.. ఆవు తో మందు బాబు చేసిన పనికి అందరికీ మైండ్ బ్లాక్
విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. స్కూల్‌లోనే అంతా..
సైలెంట్ కిల్లర్స్‌గా ఇయర్‌ఫోన్స్.. అతిగా వాడితే వచ్చే సమస్యలు ఇవే