దొంగతనానికి వచ్చిన వ్యక్తి ఓ ఇంట్లో బంగారు, వెండి విలువైన వస్తువులన్నీ సర్దేసుకున్నాడు. దొంగతనం చేసి తీరా ఇంట్లోంచి పారిపోవాల్సిన సమయంలో అక్కడే గుర్రుపెట్టి నిద్రపోయాడు. ఉదయాన్నే దొంగను చూసిన ఆ ఇంటి యజమాని పోలీసులకు పట్టించడంతో కటకటాలపాలయ్యాడు. దీనంతటికీ కారణం ఆ దొంగ పీకలదాకా మద్యం సేవించడమే. ఈ విచిత్ర సంఘటన మధ్యప్రదేశ్ లోని నజీరాబాద్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం…
మధ్యప్రదేశ్‌లోని నజీరాబాద్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మర్యంపూర్ రైల్వే లైన్లో పక్కపక్కనే ఉన్న అన్నదమ్ముల ఇళ్లలోకి మద్యానికి బానిసైన ఓ దొంగ అర్థరాత్రి సమయంలో చొరబడ్డాడు. పీకలదాకా తాగేసిన ఒక దొంగ ఓ ఇంట్లో చొరబడి బంగారం, విలువైన వస్తువులు దోచుకున్నాడు. ముందు వినోద్ కుమార్ ఇంటి కిటికీలను పగలగొట్టి లోపలికి వెళ్లి.. లాకర్ ఓపెన్ చేసి విలువైన వస్తువుల్ని కాజేశాడు. ఆపై రెండిళ్ల మధ్య ఉన్న తలుపును కూడా పగలగొట్టి అనిల్ ఇంట్లోకి ప్రవేశించాడు. అక్కడ బీరువాలో ఉన్న నగలను దొంగిలించాడు. ఇంతలో తాగిన మైకం కమ్మి అక్కడే నిద్రపోయాడు.
అయితే మద్యం మత్తులో ఉండటం వల్ల అదే ఇంట్లో ఓ మూలన ఆదమర్చి నిద్రపోయాడు. తెల్లవారుజామున ఇంటి యజమాని అతన్ని చూసి షాక్ తిన్నాడు. తన ఇంట్లోని బంగారం, ఇతర విలువైన వస్తువులు నిద్రపోతున్న వ్యక్తి దగ్గర కనిపించాయి. దాంతో స్థానికులతో కలిసి ఆ దొంగకు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కట్టకాల్లో వేశారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి