చిన్నారికి చాక్లెట్ కావాలంటే కొనిపెట్టారు.. వామ్మో.. నోట్లో పెట్టగానే పేలిపోయింది.. చివరకు

చిన్నారికి చాక్లెట్ కావాలంటే కొనిపెట్టారు.. వామ్మో.. నోట్లో పెట్టగానే పేలిపోయింది.. చివరకు


చిన్నారులకు.. చాక్లెట్లు, బిస్కెట్లు అంటే ఎంతో ఇష్టం.. వారు కొనిచ్చే వరకు మారం చేస్తూనే ఉంటారు.. ఇలా మారం చేస్తుంటే.. మూడేళ్ల కూతురికి తల్లి చాక్లెట్ కొనిచ్చింది.. అయితే.. ఆ చిన్నారి సంబరంతో చాక్లెట్ ను తీసుకుని.. కవర్ తీసి నోటీలో పెట్టుకుంది.. అలా నోట్లో పెట్టుకుందో లేదో.. చిన్నారి నోటిలోనే చాక్లెట్ పేలిపోయింది. దీంతో బాలిక దవడ మొత్తం చీలిపోయి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని అల్వార్‌లో చోటుచేసుకుంది. బాలిక నోట్లో చాక్లెట్‌ పేలడం తీవ్ర కలకలం రేపింది. ఓ దుకాణంలో చాక్లెట్‌ కొనుగోలు చేసిన బాలిక నోట్లో పెట్టుకొని నములుతుండగా పేలుడు జరిగింది. పేలుడు ధాటికి బాలిక దవడ ,చెంప చీలిపోయింది. చాక్లెట్‌ బదులు గన్‌పౌడర్‌ నింపిన పదార్ధాన్ని బాలికకు ఇచ్చినట్టు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. దుకాణ యాజమానిని అరెస్ట్‌ చేసి పోలీసులు విచారిస్తున్నారు.

అయితే.. చాక్లెట్ పేలడంతో తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్న బాలికను కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను అల్వార్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు. అమ్మాయి ప్రస్తుతం ప్రమాదం నుండి బయటపడిందని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక కోసం చూస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

పేలుడు ధాటికి కూల్ డ్రింక్ కూడా పగిలిపోయింది..

తన కూతురు అక్షు (3)కు ఊర్లోనే ఉన్న కిరాణా కొట్టులో చాక్లెట్ కొనిచ్చానని.. అది నోట్లో పెట్టుకోగానే పేలిపోయినట్లు చిన్నారి తల్లి తెలిపింది. ప్రస్తుతం బాలిక ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు రామ్‌గఢ్ ఎస్‌హెచ్ఓ విజయేంద్ర సింగ్ తెలిపారు. ఈ ఘటనపై చిన్నారి అత్త నికిత పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. సుదీల్ అలియాస్ కలా.. అక్షుకి గన్ పౌడర్ ఉన్న ఫైర్ క్రాకర్ చాక్లెట్ ఇవ్వడంతో ఆమె తీవ్రంగా గాయపడిందని, ఆ సమయంలో తనకూతురు అహానా కూల్ డ్రింక్ తీసుకోగా.. అది కూడా పగిలిందని పోలీసులకు వెల్లడించింది. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని రామ్‌గఢ్ ఎస్‌హెచ్ఓ విజయేంద్ర సింగ్ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *