చిన్నమ్మ కొత్త పార్టీ..? తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఆ పార్టీలకు చెక్ పెట్టేందుకేనా..!

చిన్నమ్మ కొత్త పార్టీ..? తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఆ పార్టీలకు చెక్ పెట్టేందుకేనా..!


సరిగ్గా పదేళ్ల క్రితం.. 2016 తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత చనిపోయిన తర్వాత అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి. జయలలితకు అత్యంత సన్నిహితురాలుగా ఉంటున్న శశికళ రాజకీయంగా గట్టి ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. అప్పటిదాకా పెండింగ్‌లో ఉన్న అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష ఖరారు కావడంతో సీఎం సీటు జారిపోవడమే కాకుండా జైలు కెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆశలన్నీ అడియాశలు అయ్యాయి. అయితే అపుడే శశికళ జయలలిత సమాధి వద్ద శపథం చేశారు. దాని ఉద్దేశం ఏంటన్నది అప్పుడు చాలామందికి అర్థం కాలేదు. ఆ తర్వాత ఆలస్యంగా అందరూ పసిగట్టారు. కానీ ఆ శపథం నెరవేరే అవకాశం అంత త్వరగా రాలేదు. ఇప్పుడు శశికళ కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. తాను ఆనాడు చేసిన శపథం నేరెవేరే సమయం ఇదే. ఐతే అందుకనువైన సమయం ఇంతకన్నా రాదు అనుకున్నారో ఏమో రాజకీయ పార్టీని స్థాపిస్తున్నారన్న చర్చ మొదలైంది.

జయలలిత ఉన్నపుడు అన్నీ తానై నడిపిన శశికళ. జయలలిత మరణం తర్వాత సీఎం కావాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు శశికళ. కోర్టు తీర్పుతో ఆశలు ఆవిరి కాగా ప్రత్యామ్నాయంగా పళనిస్వామిని సీఎం చేశారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందనేది శశికళ జైలుకెళ్లే ముందే గ్రహించారు. ఎప్పటినుంచో రిజర్వులో ఉన్న అక్రమాస్తుల కేసులో వెంటనే శిక్ష ఖరారు కావడం అనేది కేవలం శశికళను సీఎం కాకుండా అడ్డుకునేందుకే అని అప్పట్లో ఆమె అనుచరులు ఆరోపించారు. బీజేపీ పెద్దలే తనను సీఎం కాకుండా అడ్డుకున్నారని శశికళ అభిప్రాయం. దీంతో జైలుకెళ్లే ముందు మెరీనా బీచ్‌లో ఉన్న జయలలిత సమాధి వద్దకు వచ్చి నివాళులు అర్పించారు. ఆ సమయంలో తీవ్ర ఆగ్రహంగా కనిపించిన శశికళ. మెరీనా బీచ్‌లో జయ సమాధి వద్ద శపథం చేశారు.

శశికళ చేసిన శపథం అప్పట్లో తీవ్రంగా చర్చ జరిగింది. ఆ శపథం ఏంటి అన్నది శశికళ వర్గం చెప్పుకొచ్చింది. చిన్నమ్మ సీఎం కాకుండా అడ్డుకున్నది కేంద్రంలోని కొందరు పెద్దలేనని శశికళ భావించి వారికి తగిన సమయంలో సరైన గుణపాఠం చెబుతానని ఆగ్రహంతో రగిలిపోతూ ఆ సమయంలో శపథం చేశారట. నాకు ఈ పరిస్థితి తెచ్చిన వారిని వదలనని ఆనాడు శపథం చేయగా ఆ తర్వాత కొన్నాళ్లకే సీఎం ఈపీఎస్ కూడా తిరుగుబాటు చేశారు. శశికళ టార్గెట్ ఇపుడు ఈపీఎస్ కూడా అయ్యారట. దీంతో ప్రస్తుతం తమిళనాడులో బీజేపీ ఏడీఎంకే కూటమిగా ఉన్నారు. అన్నాడీఎంకే పార్టీకి బలమైన సామాజిక వర్గంగా ఉన్నది దేవర వర్గం. శశికళ దేవర్ సామాజికవర్గానికి చెందిన నాయకురాలు. అదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతలు డిఎంకెని వీడి విజయ్ స్థాపించిన టీవీకే పార్టీలో చేరిపోయారు.. ఇక మాజీ సీఎం పన్నీర్ సెల్వం కూడా దేవర్ సామాజికవర్గానికి చెందిన నేత..ఆయన కూడా ప్రస్తుతం వేరుగా ఉంటున్నారు..

ఇప్పుడు శశికళ సొంత పార్టీ ఏర్పాటు చేసి దేవర్ సామాజిక వర్గ ఓట్లలో భారీగా చీలిక తీసుకురావాలని భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2021 ఎన్నికల్లోనే ఈ ప్రయత్నం చేయాలని అనుకున్నా .. ఆ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా డీఎంకే అధికారంలోకి రావడం ఖాయం కాబట్టి ఆ పరిస్థితుల్లో పార్టీ ఏర్పాటు అంత అవసరం లేదు అని భావించిన శశికళ ఇదే సరైన సమయం అని భావించే పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది.. ఇన్నాళ్లకు పార్టీ పెట్టీ ఏడీఎంకే, బీజేపీ కూటమిని దెబ్బ కొట్టాలన్న వ్యూహంతో పార్టీ పెడుతున్నారన్న జరుగుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *