ప్రేక్షకులను ఆకట్టుకునే కథలతో చాలా సినిమాలు తెరకెక్కుతున్నాయి. భాషతో సంబంధం లేకుండా వివిధ భాషల్లో సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుండటంతో చాలా సినిమాలు ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్నాయి. ఒకేసారి ఐదు ఆరు భాషల్లో రిలీజ్ అవుతున్నాయి సినిమాలు. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా అన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కాగా ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమాలుగా ఇతర భాషలు రిలీజ్ అవుతున్నాయి కానీ.. అంతకు ముందు డబ్బింగ్ ద్వారా ఇతర భాషలు సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యేవి. ముఖ్యంగా తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు తెలుగులోకి ఎక్కువగా డబ్బింగ్ అయ్యేవి. అలా వచ్చిన సినిమాలు మన దగ్గర కూడా మంచి విజయాలను అందుకున్నాయి. అలా వచ్చిన సినిమానే రతినిర్వేదం. మలయాళంలో వచ్చిన ఈ సినిమా తెలుగులోనూ అదే పేరుతో డబ్ అయ్యింది.
ఇది కూడా చదవండి :ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి
1970లో భరతన్ అనే రచయత రాసిన నవల “రతి నిర్వేదం” ఆధారంగా ఇప్పటికే 1978లో నిర్మించారు. ఇక ఈ సినిమాలో శృంగారపు సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన హీరోయిన్ గుర్తుందా.? ఆమె పేరు శ్వేతా మీనన్. ఈ సినిమాలో ఆమె అద్భుతంగా నటించి మెప్పించింది ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయింది ఈ అమ్మడు శ్వేతామీనన్ నటి, మోడల్, టెలివిజన్ యాంకర్ గాను చేసింది. ఆమె 1994లో ఫెమినా మిస్ ఇండియా ఆసియా పసిఫిక్ టైటిల్ విజేతగా నిలిచింది.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి : ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి
శ్వేత మీనన్ మలయాళం, హిందీ, తెలుగు, తమిళ భాషా సినిమాల్లో నటించి ఉత్తమ నటిగా రెండు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది. ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించింది. అలాగే మలయాళం టీవీ షోల్లో కనిపించింది. ఇక పలు సీరియల్స్ లోనూ నటిస్తూ బిజీగా ఉంది ఆమె. ఇదిలా ఉంటే తాజాగా శ్వేత మీనన్ పై కేసు నమోదైంది. అడల్ట్ చిత్రాల్లో నటిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తోందని ఆమె పై ఆరోపణలు వచ్చాయి. మార్టిన్ అనే వ్యక్తి శ్వేత మీనన్ పై ఫిర్యాదు చేశాడు. గతంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. డబ్బుల కోసం ఎలాంటి సినిమాలైనా చేస్తా అని ఆమె చెప్పిందని మార్టిన్ తెలిపాడు. ఫిర్యాదు చేసినా కూడా పోలీస్లు పట్టించుకోవడం లేదని అతను కోర్టును ఆశ్రయించినట్లు తెలిపాడు. దీనిపై శ్వేత మీనన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి : అప్పట్లో ఊపేసిన హీరోయిన్.. అందరితో నటించింది.. కానీ నాగార్జునను మాత్రం రిజెక్ట్ చేసింది
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.