చికెన్, మటన్ ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలిస్తే మీరు బిత్తరపోవడం గ్యారెంటీ..

చికెన్, మటన్ ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలిస్తే మీరు బిత్తరపోవడం గ్యారెంటీ..


చికెన్, మటన్ ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలిస్తే మీరు బిత్తరపోవడం గ్యారెంటీ..

భారతదేశంలో మహిళా ఆరోగ్యానికి సంబంధించి బ్రెస్ట్ క్యాన్సర్ ఒక పెను సవాలుగా మారింది. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకే పరిమితమైన ఈ వ్యాధి, ఇప్పుడు మన దేశంలో ముఖ్యంగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో వేగంగా విస్తరిస్తోంది. పట్టణ ప్రాంత మహిళల్లో గ్రామీణ ప్రాంతాల కంటే ఈ ముప్పు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వైద్య నిపుణులు, పరిశోధనల ప్రకారం.. కేవలం జన్యుపరమైన కారణాలే కాకుండా మన రోజువారీ అలవాట్లు కూడా క్యాన్సర్‌కు దారితీస్తున్నాయి.

ఆహారపు అలవాట్లు

అతిగా వేయించిన, ఎక్కువ కొవ్వు ఉన్న ఆహారాలు, ప్రాసెస్ చేసిన మాంసం తీసుకోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది శరీరంలో అసాధారణ కణాల పెరుగుదలకు కారణమవుతుంది. శారీరక శ్రమ లేకపోవడం, గంటల కొద్దీ కూర్చుని పని చేయడం వల్ల వచ్చే ఊబకాయం క్యాన్సర్ ముప్పును రెట్టింపు చేస్తుంది. ఆలస్యంగా వివాహం చేసుకోవడం, 30 ఏళ్లు దాటాక పిల్లలను కనడం,శిశువులకు సరిగ్గా పాలివ్వకపోవడం వంటివి పట్టణ మహిళల్లో ఈ సమస్య పెరగడానికి కారణమవుతున్నాయి.

మాంసాహారం నిజంగా ప్రమాదకరమా

ICMR, ఇతర స్టడీల ప్రకారం.. మాంసాహారం నేరుగా క్యాన్సర్ కలిగించదు. కానీ మాంసాన్ని వండే పద్ధతి, దాని నాణ్యత ముఖ్యం. బాగా ఉడికించని లేదా అతిగా నూనెలో వేయించిన మాంసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో క్యాన్సర్ కారక కణాలు వృద్ధి చెందే అవకాశం ఉంది.

క్యాన్సర్ ఎలా సంభవిస్తుంది?

మన శరీరంలోని కణాలు ఒక క్రమపద్ధతిలో విభజన చెందుతాయి. కానీ హార్మోన్ల మార్పులు లేదా అన్‌హెల్తీ డైట్ వల్ల ఈ విభజన అదుపు తప్పుతుంది. అసాధారణంగా పెరిగే ఈ కణాలు కణితులుగా మారి, క్రమంగా శరీరంలోని ఇతర భాగాలకు పాకుతాయి.

నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

బ్యాలెన్స్‌డ్ డైట్: పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోండి.

శారీరక శ్రమ: రోజుకు కనీసం 30-40 నిమిషాల నడక లేదా వ్యాయామం తప్పనిసరి.

బరువు నియంత్రణ: బాడీ మాస్ ఇండెక్స్‌ని అదుపులో ఉంచుకోవడం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది.

రెగ్యులర్ చెకప్స్: 40 ఏళ్లు దాటిన మహిళలు ఏటా మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవడం మంచిది. అలాగే నెలకోసారి రొమ్ముల్లో గడ్డలు, నొప్పి లేదా రంగులో మార్పులు ఉన్నాయో లేదో సొంతంగా పరీక్షించుకోవాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *