Shubman Gill : భారత టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఒక అద్భుతమైన ఘనతను సాధించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీసులో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో తను డబుల్ సెంచరీ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ డబుల్ సెంచరీతో గిల్ కేవలం ఇంగ్లండ్‌లోనే కాదు.. సెనా దేశాలైన దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో టెస్ట్ మ్యాచ్‌లలో కెప్టెన్‌గా డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. అతని ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ భారత క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.
శుభ్‌మన్ గిల్ సాధించిన ఈ డబుల్ సెంచరీ కేవలం భారతీయ కెప్టెన్‌ల రికార్డులలోనే కాదు.. ఆసియా క్రికెట్‌లోనూ ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. సెనా దేశాల్లో టెస్ట్ క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన మొదటి ఆసియా కెప్టెన్ గిల్ అయ్యాడు. ఇంతకుముందు, 2011లో లార్డ్స్‌లో 193 పరుగులు చేసిన తిలకరత్నే దిల్షాన్ కార్డు అగ్రస్థానంలో ఉండేది. కెప్టెన్‌గా ఇంగ్లండ్‌లో డబుల్ సెంచరీ చేసిన మొదటి భారతీయుడు కూడా గిల్‌నే. అయితే, ఇంగ్లండ్ గడ్డపై 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన వారిలో సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్ తర్వాత గిల్ మూడవవాడు.
Leading from the front 🫡
First Indian Captain to register a double-century in Test cricket in England 👏👏
Updates ▶️ https://t.co/Oxhg97g4BF#ENGvIND | @ShubmanGill pic.twitter.com/Pm7pq7GRA9
— BCCI (@BCCI) July 3, 2025
ఈ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ ఇప్పటివరకు 350 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక ఆటగాడు కూడా అతడే. మొదటి మ్యాచ్‌లో కూడా అతను సెంచరీ సాధించి 147 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులు మాత్రమే చేశాడు. ఈ డబుల్ సెంచరీతో కలిపి తను కేవలం మూడు ఇన్నింగ్స్ లలోనే 350కి పైగా పరుగులు సాధించడం విశేషం. శుభ్‌మన్ గిల్ 311 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో తన టెస్ట్ కెరీర్‌లో మొదటి డబుల్ సెంచరీని నమోదు చేశాడు. ఈ సమయంలో తన స్ట్రైక్ రేట్ 64.31గా ఉంది. ఇది టెస్ట్ క్రికెట్‌లో మంచి స్ట్రైక్ రేటుగా భావిస్తున్నారు. అంతేకాదు, గిల్ ఇప్పటికే వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కూడా డబుల్ సెంచరీని సాధించాడు. దీంతో టెస్ట్, వన్డే రెండు ఫార్మాట్లలోనూ డబుల్ సెంచరీలు సాధించిన అతి కొద్దిమంది ప్లేయర్లలో ఒకడిగా నిలిచాడు.
శుభ్‌మన్ గిల్ (209* పరుగులు, 316 బంతుల్లో) ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌పై సాధించిన డబుల్ సెంచరీతో టెస్ట్ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన ఆరో టీంఇండియా కెప్టెన్ అయ్యాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ, ఎం.ఏ.కె. పటౌడీ, సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్, ఎం.ఎస్. ధోని కూడా ఉన్నారు. గిల్, చిన్న వయసులోనే టెస్ట్ డబుల్ సెంచరీ సాధించిన రెండో టీం ఇండియా కెప్టెన్ కూడా అయ్యాడు. ఈ రికార్డులో ఎం.ఏ.కె. పటౌడీ (23 సంవత్సరాలు, 39 రోజులు) తర్వాత గిల్ (25 సంవత్సరాలు, 298 రోజులు) రెండో స్థానంలో ఉన్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..