చనిపోయిన మగపాము పక్కనే రోజంతా ఆడపాము.. ప్రేమంటే ఇదేరా

చనిపోయిన మగపాము పక్కనే రోజంతా ఆడపాము.. ప్రేమంటే ఇదేరా


మధ్యప్రదేశ్‌లోని మోరేనా జిల్లాలోని ధుర్కుడా కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికుల్ని కన్నీరు పెట్టించిందట. చనిపోయిన తన భాగస్వామి మగసర్పం పక్కనే ఆడ సర్పం 24 గంటల పాటు వేచి ఉందని స్థానికులు చెబుతున్నారు. భాగస్వామిని విడిచి బతకలేక ఆ పాము కూడా ప్రాణాలు వదిలిందట. ఈ ఘటన గురువారం పహడ్గఢ్ పంచాయతీ సమితి పరిధిలో వెలుగు చూసిందని ఓ డిజిటల్ మీడియా పబ్లికేషన్ వెల్లడించింది. రహదారిపై రోడ్డు దాటుతుండగా వాహనం పాముపై నుంచి దూసుకెళ్లడంతో మగ సర్పం మరణించింది. గ్రామస్తులు ఆ మగ పామును రోడ్డుకు పక్కన ఉంచగా.. కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్న ఆడ సర్పం తన జతను కోల్పోవడంతో దానిని అలా చూస్తూ ఉండిపోయిందట. ఆ ఆడ సర్పం తమకు ఏదో చెప్పాలన్నట్లు ప్రయత్నించిందని గ్రామస్థులు తెలిపారు. దాదాపు 24 గంటల పాటు తన ప్రాణసఖుడి పక్కనే ఉండి.. చివరకు తాను కూడా ఈ లోకాన్ని వీడింది. ఈ హృదయ విదారక ఘటన చూసిన గ్రామస్థులందరూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆ జంట పాములకు సంప్రదాయ బద్దంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఆ పాముల అనురాగానికి గుర్తుగా.. గ్రామస్థులు ఆ ప్రదేశంలో ఓ వేదిక నిర్మించాలని నిర్ణయించారు. అది వారి ప్రేమకు చిహ్నంగా నిలిచిపోయేలా ఉంటుందని చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అద్దెకి 3 BHK ఫ్లాట్‌.. 19 లక్షలు డిపాజిట్ కడితేనే

ఫుట్‌బాల్‌ ఆడుతున్న రోబోలు.. ఇక మేము ఏం ఆటలు ఆడాలి అంటున్న మనుషులు

కొత్త టెక్నిక్‌తో చేపలుపడుతున్న గోదారోళ్లు.. కొత్త ట్రెండ్ సూపర్ అంటున్న నెటిజన్స్

లగ్జరీ కార్లున్నా ఆటోలో తిరుగుతున్న స్టార్ హీరోయిన్..

దీపికకు అరుదైన ఘనత.. ఈ ఫీట్ సాధించిన ఏకైక ఇండియన్ స్టార్ ఈమే



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *