చదివింది లా.. గురుడు చేసే పని తెలిస్తే షాకే

చదివింది లా.. గురుడు చేసే పని తెలిస్తే షాకే


సాధారణంగా ఎవరైనా సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని, స్వలాభంతోపాటు, ఇతరులకూ ఉపయోగపడాలని న్యాయవిద్యని, వైద్యవిద్యను అభ్యసిస్తారు. అయితే.. ఇక్కడ ఒక న్యాయ విద్యార్థి మాత్రం తన తెలివితేటలను దొంగతనాలకు ఉపయోగించాడు. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 61 ల్యాప్‌టాప్‌లను చోరీ చేసిన కిలాడీ దొంగ పతమిళ్ సెల్వన్‌ను మంగళగిరి పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని తిరువారూర్ జిల్లాకు చెందిన పతమిళ్‌ సెల్వన్ న్యాయ విద్యను అభ్యసించాడు. యూనివర్సిటీల్లో ప్రవేశాల పేరుతో దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలకు వెళ్లడం ఇతని అలవాటు. అక్కడ విద్యార్థుల వసతి గృహాలు, వారి కదలికలపై నిశితంగా రెక్కీ నిర్వహిస్తాడు. అదును చూసి విద్యార్థుల ల్యాప్‌టాప్‌లతో ఉడాయిస్తాడు. ఇటీవల అమరావతి రాజధాని ప్రాంతంలోని అమృత విశ్వ విద్యాపీఠం, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హాస్టళ్లలో ల్యాప్‌టాప్‌లు మాయమవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. డిసెంబర్ 31న జరిగిన ఈ చోరీలపై కేసు నమోదు చేసిన మంగళగిరి పోలీసులు, సీసీటీవీ విజువల్స్ మరియు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడిని గుర్తించారు. గోవా, చెన్నై వంటి నగరాల్లోనూ ఇతనిపై కేసులు ఉన్నట్లు విచారణలో తేలింది. తిరిగి రాజధాని ప్రాంతంలో చోరీకి ప్రయత్నిస్తుండగా, మంగళగిరి సమీపంలోని డాన్ బోస్కో వద్ద పోలీసులు మాటు వేసి సెల్వన్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 12 లక్షల రూపాయల విలువైన 15 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. అత్యంత చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్న సిబ్బందిని ఆయన అభినందించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మొహం నిండా గాయాలతో క్రికెటర్ బెన్ స్టోక్స్.. షాక్ లో అభిమానులు

నీ కోసం.. కొండనైనా కదిలిస్తా.. నటి సెలీనా జైట్లీ కన్నీటి పోరాటం

వెంటనే బోర్డర్ దాటండి.. ఇరాన్‌‌లోని అమెరికన్లకు పిలుపు

భాగ్యనగరం వేదికగా రికార్డులకెక్కిన మెగా ఐస్‌క్రీమ్ పార్టీ

సమ్మక్క తమ్ముడి జాతర.. అంకన్నగూడెంలో పూనకాలు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *